Reading Time: < 1 minute
Is Mojtaba Khamenei In A Coma Reports Claim Irans New Supreme Leader Critically Injured

Iran Supreme Leader: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ తన తొలి ప్రకటన చేశారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తూనే ఉంటామని, వాటిని మూసేయాలని వార్నింగ్ ఇచ్చారు. తన శత్రువులపై ఒత్తిడి పెంచడానికి ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసే ఉంచాలని పేర్కొన్నాడు. అయితే, ఈ ప్రకటన వెలువడిన తర్వాత మరో వార్త అంతర్జాతీయ మీడియాలో సంచలనంగా మారింది.

పాశ్చాత్య మీడియాలో కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ కోమాలో ఉన్నారని, ఒక కాలు కోల్పోయడని పేర్కొంది. టెహ్రాన్ వర్గాల ప్రకారం ‘‘ది సన్’’ నివేదించింది. యూకే మీడియా ప్రకారం.. వైమానిక దాడిలో గాయపడిన ఖమేనీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, అందులోని వర్గాల నుంచే ఈ సమాచారం వచ్చిందని తెలిపింది. మోజ్తామా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉందని, కడుపు లేదా కాలేయం కూడా తీవ్రంగా దెబ్బతిందని తెలిపింది. ఫిబ్రవరి 28న అప్పటి సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా జరిగిన వైమానిక దాడి సమయంలోనే, మోజ్తబా గాయపడ్డాడనే అనుమానాఅలు ఉన్నాయి.

Read Also: Iran War: ‘‘హార్ముజ్‌ను మూసే ఉంచాలి’’.. కొత్త సుప్రీం లీడర్ ఆదేశాలు..

ప్రస్తుతం, ఆయనను సినా యూనివర్సిటీ హాస్పిటల్‌లో ఇంటెన్సివ్ కేర్‌లో వైద్య చికిత్స అందిస్తున్నారని, భవనంలో ఒక భాగాన్ని సీజ్ చేశారని, సంఘటనా స్థలంలో భారీ సెక్యురిటీ ఉందని సోర్సెస్ చెబుతున్నాయి. మోజ్తబా చాలా సీరియస్‌గా ఉన్నారని, ఆస్పత్రిలోని ట్రామా టీంలోని వ్యక్తులు చెప్పినట్లుగా సమాచారం. ‘‘అతడి ఒకటి లేదా రెండు కాళ్లు పూర్తిగా కట్ అయ్యాయి. అతడి కాలేయం లేదా కడుపు చీలిపోయింది. అతను కోమాలో ఉన్నాడు’’ అని ది సన్ పేర్కొంది. దీనికి ముందు ఇరాన్ స్టేట్ మీడియా కూడా మోజ్తాబాను ‘‘గాయపడిన యుద్ధవీరుడు’’ అని పేర్కొనడం గమనార్హం. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ రెండు రోజుల క్రితం సినా ఆసుపత్రిని సందర్శించారని కూడా నివేదికలు చెబుతున్నాయి. కొత్త సుప్రీం లీడర్ సురక్షితంగా ఉన్నారని పెజెష్కియాన్ అన్నారు.