Reading Time: < 1 minute
India Womens Hockey Team Semi Final Clash Vs Italy

India Womens Hockey Team : భారత మహిళల హాకీ జట్టు జైత్రయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శిస్తూ ఇప్పటికే ప్రపంచకప్‌లో తమ బెర్త్‌ను ఖరారు చేసుకున్న భారత్, ఇప్పుడు తమ తదుపరి లక్ష్యమైన టైటిల్ విజయంపై కన్నేసింది. ఈ టోర్నమెంట్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్, సెమీఫైనల్‌కు చేరడం ద్వారా ప్రపంచకప్‌కు అర్హత సాధించాలన్న మొదటి లక్ష్యాన్ని చేరుకుంది. అయితే, కేవలం అర్హతతోనే సంతృప్తి చెందకుండా, చాంపియన్లుగా నిలవాలన్న పట్టుదలతో ఆటగాళ్లు ఉన్నారు. సెమీఫైనల్‌లో బలమైన ఇటలీని ఎదుర్కోవడం భారత జట్టుకు అసలైన పరీక్ష కానుంది. ఫైనల్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు అనివార్యం.

Sharwanand: ‘బైకర్’ కోసం శర్వానంద్ ట్రాన్స్‌ఫర్మేషన్ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్‌కు ముందు జట్టు వ్యూహాలపై కోచ్, ప్లేయర్లు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రత్యర్థి జట్టు ఇటలీ డిఫెన్స్‌ను ఎలా ఛేదించాలనే దానిపై పక్కా ప్రణాళికలతో కసరత్తు చేస్తున్నారు. జట్టులో ఉన్న యువ రక్తం , అనుభవజ్ఞుల కలయిక భారత్‌కు ప్రధాన బలంగా మారింది. వరుస విజయాలు అందించిన జోష్‌తో ఉన్న భారత జట్టు, ఇటలీని ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లాలని గట్టి నిర్ణయంతో ఉంది. ఈ కీలక పోరు కోసం క్రీడా అభిమానులు కూడా భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

120Hz LCD డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో iQOO Z11x 5G లాంచ్.. ధర ఎంతంటే?