Reading Time: 1 minute
Hardeep Singh Puri Parliament Statement India Fuel Security 2026

LPG Crisis: ఇరాన్ యుద్ధం కారణంగా, దేశంలో గ్యాస్, పెట్రోల్ సంక్షోభంపై కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు. దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత లేదని స్పష్టం చేశారు. గృహ వినియోగదారులకు ఎలాంటి సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. కమర్షియల్ గ్యాస్‌ను బ్లాక్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ముందుగా సాధారణ ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. స్కూల్స్, హాస్పిటల్స్‌కు ఎలాంటి అవాంతరాలు లేకుండా సరఫరా చేస్తున్నామని చెప్పారు. మిగతా దేశాలతో పోలిస్తే చమురు విషయంలో భారత్ స్థానం పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు.

Read Also: Sprouts Chilla Recipe: బ్రేక్‌ఫాస్ట్‌లో “మొలకల చిల్లా” చేసుకోండి.. రుచితో పాటు ఆరోగ్యం..

గల్ఫ్ దేశాల నుంచి 60 శాతం ఎల్పీజీని దిగుమతి చేసుకుంటున్నామని, దేశంలో డిజిల్, పెట్రోల్ కొరత లేదని చెప్పారు .గల్ఫ్ దేశాలకు బదులుగా నార్వే, కెనడా నుంచి దిగుమతి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెప్పారు. దేశంలోని అన్ని రిఫైనరీలు అధిక సామర్థ్యంలో పని చేస్తున్నాయని చెప్పారు. హార్ముజ్ జలసంధి నుంచి కాకుండా వేరే ప్రాంతాల నుంచి ముడి చమురు దిగుమతులు దాదాపుగా 70 శాతానికి పెరిగాయని వెల్లడించారు. భారతదేశం చమురు అవసరాల కోసం 2006-07లో 27 దేశాలపై ఆధారపడితే, ఇప్పుడు ఇది 40 దేశాలకు పెరిగిందని కేంద్రమంత్రి చెప్పారు.

ఆధునిక ఇంధన చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదని, భారతదేశ ముడి చమురు స్థానం సురక్షితంగా ఉందని, సంక్షోభానికి ముందు భారత ముడి చమురు దిగుమతుల్లో 45 శాతం మాత్రమే హార్ముజ్ ద్వారా రవాణా జరిగిందని, సంక్షోభ సమయంలో కూడా ప్రధాని మోడీ దౌత్యం వల్ల భారతదేశానికి హర్ముజ్ జలసంధిని ఇరాన్ అనుమతించిందని సభలో తెలిపారు.