Reading Time: 2 minutes
Cm Chandrababu Naidu Announces Annadata Sukhibhava Scheme 3rd Installment For Farmers Tomorrow

CM Chandrababu: రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు వాటి లబ్ధి సక్రమంగా చేరే విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 6వ జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్సులో పలు కీలక అంశాలపై ఆయన అధికారులకు సూచనలు చేశారు.

సూపర్ 6 పథకాలతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వివిధ పథకాల లబ్ధిదారులకు ప్రజా ప్రతినిధుల ద్వారా సంక్షేమ లేఖలు అందించాలని ఆయన సూచించారు. ప్రతి లబ్ధిదారుకు ప్రభుత్వం నుంచి ఏ పథకం ద్వారా ఎంత లబ్ధి అందిందో తెలియేలా ఈ లేఖలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

120Hz LCD డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో iQOO Z11x 5G లాంచ్.. ధర ఎంతంటే?

ప్రతి కుటుంబానికి ఏ పథకం ద్వారా ఎంత ప్రయోజనం అందిందో స్పష్టంగా తెలియజేస్తే వ్యవస్థ మరింత పారదర్శకంగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం అందించే పెన్షన్, ఉచిత సిలిండర్, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల వివరాలు లబ్ధిదారులకు స్పష్టంగా చేరాలని అన్నారు. డీబీటీ పథకాల అమలులో సాంకేతికతను వినియోగించాలని సీఎం సూచించారు. ముఖ్యంగా దీపం 2.0 స్కీం పథకానికి డిజిటల్ వోచర్లు జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. అలాగే డీబీటీ పథకాలలో ప్రోగ్రామబుల్ వోచర్లు ఇస్తే లబ్ధిదారులు వాటిని అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోగలరని తెలిపారు.

మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కూడా సీఎం వివరాలు వెల్లడించారు. మార్చి 9 నాటికి మహిళలు మొత్తం 50.45 కోట్ల ప్రయాణాలు చేసినట్లు తెలిపారు. ఇందుకు గాను ప్రభుత్వం APSRTCకు రూ.1775 కోట్లను రీయింబర్స్ చేసినట్లు తెక్కిపారు. పేదరిక నిర్మూలన దిశగా డ్వాక్రా, మెప్మా సంఘాల సేవలను వినియోగించి పీ4 సహా జీరో పావర్టీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఇంకా కుటుంబ సాధికారిత, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల ప్రభుత్వ లక్ష్యమని.. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి త్వరలో ప్రత్యేక క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

వ్యవసాయ రంగానికి సంబంధించి “అన్నదాత సుఖీభవ స్కీం” పథకం కింద రేపు మూడో విడత నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలాగే “అన్న కాంటీన్స్” ద్వారా ఇప్పటివరకు పేదలకు 7.5 కోట్ల భోజనాలు అందించినట్లు చెప్పారు. సామాజిక రంగంలో కూడా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వెల్లడించారు. అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీ అమలు చేస్తుమన్నారు. ఇంకా రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో “పల్లె పండుగ ప్రోగ్రాం” కింద రూ.4 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు.

Revanth Reddy : హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్ వచ్చిందంటే, హాలీవుడ్ ఇక్కడికి వచ్చినట్లే

సంక్షేమ పథకాల లాస్ట్ మైల్ డెలివరీ లక్ష్యంగా కలెక్టర్లు పనిచేయాలని సీఎం ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతూకం ఉండేలా జిల్లా పరిపాలన నడపాలని సూచించారు. ఇళ్ల సమస్య పరిష్కారంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందని సీఎం తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం లేదా ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉగాది పండుగ సందర్భంగా 2.5 లక్షల మందికి సామూహిక గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఇంకా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కూడా సీఎం దృష్టి పెట్టారు. ప్రతి ఇంటికి జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి కుళాయి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే దిశగా పని చేస్తున్నామని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామాల్లో సాలిడ్, లిక్విడ్ వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. ఘన వ్యర్థాలను వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు తరలించడం, తడి వ్యర్థాలతో కంపోస్ట్ తయారీకి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే 500 పాఠశాలల్లో నెట్ జీరో కాన్సెప్ట్‌తో కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.

Monalisa: “మోనాలిసా” చనిపోతానని బెదిరించింది, అందుకే పెళ్లి చేసుకున్నాం

కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్ జీ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.9773 కోట్లు కేటాయించిందని సీఎం వెల్లడించారు. ఈ పథకం డిమాండ్ డ్రివెన్ కాకపోవడంతో అందుకు అనుగుణంగా దాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఇంకా పెట్టుబడుల గురించి ఎంతగా ఆలోచిస్తున్నామో.. పేదలకు అందించే సంక్షేమం, వారికి కల్పించే సాధికారత గురించి కూడా అదే స్థాయిలో ఆలోచించాలని సీఎం కలెక్టర్లకు సూచించారు.