Reading Time: < 1 minute
Sharwanand Biker Movie Transformation Motocross Drama Release Date

చాలాకాలం తర్వాత వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో హిట్ అందుకున్నాడు శర్వానంద్. ఇప్పుడు శర్వానంద్ నటించిన ‘బైకర్’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఒకప్పుడు ‘అఖండ’ దెబ్బకు వాయిదా పడిన ఈ సినిమా, ఏప్రిల్ మూడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇండియాలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి మోటోక్రాస్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కోసం, మునుపెన్నడూ లేని విధంగా ఫిజికల్ మేక్ ఓవర్ అయ్యాడు శర్వానంద్. ఈ సినిమా కోసం శర్వా పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు.

Also Read : Monalisa: మాది లవ్ జిహాద్ కాదు..ప్రతి మతాన్ని సమానంగానే భావిస్తా!

తాజాగా విడుదలైన ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియో, అలాగే ఫోటోలు చూస్తే.. శర్వా ఈ సినిమా కోసం తన బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మార్చేసుకున్నట్టు అర్థమవుతుంది. లుక్ కోసం మాత్రమే కాకుండా, ఒక ప్రొఫెషనల్ రేసర్ బాడీ ఎలా ఉండాలో దానికి తగ్గట్టు అత్యంత క్రమశిక్షణతో కూడిన శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. రేసింగ్ ట్రాక్ మీద హై-టార్క్ బైక్‌లను నియంత్రించడానికి అవసరమైన శారీరక దృఢత్వం కోసం, ఆయన ఎన్నో పవర్ డ్రిల్స్, కోర్ స్టెబిలైజేషన్ వంటి కఠినమైన వర్కౌట్స్ చేశారని తెలుస్తోంది.