Reading Time: < 1 minute
Viral Kumbh Mela Girl Monalisa Responds To Love Jihad Claims After Marriage

కుంభమేళాలో పూసలమ్ముకుంటూ వైరల్ అయిన మోనాలిసా, ఏకంగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆమెకు ముందుగా సినిమా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా, ఆమె మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెతో సినిమా చేయాలని తాను 10 కోట్లు లోన్ తీసుకున్నానని, ఆమె వల్ల తాను అరెస్టయి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.
కానీ ఆమె మాత్రం ఒక ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందని, ఇది కచ్చితంగా ‘లవ్ జిహాద్’ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, తాజాగా ప్రియుడు ఫర్మాన్‌ ఖాన్‌ను తిరువనంతపురంలో పెళ్లి చేసుకున్న మోనాలిసా, కేరళ మీడియా ముందుకు వచ్చారు.

Also Read :Monalisa: “మోనాలిసా” చనిపోతానని బెదిరించింది, అందుకే పెళ్లి చేసుకున్నాం

తాను హిందూ ఆచారం ప్రకారం హిందూ దేవాలయంలో పెళ్లి చేసుకున్నానని, ఇది కచ్చితంగా లవ్ జిహాద్ కాదని ఆమె డైరెక్టర్ సనోజ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తాను అన్ని మతాలను సమానంగా గౌరవిస్తానని పేర్కొన్న ఆమె, ప్రతి మతాన్ని సమానంగానే భావిస్తానని చెప్పుకొచ్చారు.
అయితే, మోనాలిసా తెలుగులో కూడా ఒక సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. సాయి చరణ్ హీరోగా ఆమె ‘లైఫ్’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ జీవితాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నట్లు ప్రారంభ సమయంలో వెల్లడించారు. అయితే, ఆ సినిమా షూటింగ్ ఎంతవరకు పూర్తయింది, అందులో మోనాలిసా పాత్ర షూటింగ్ పూర్తయిందా లేదా అనే విషయం మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు.