July 10, 2026

Ugadi 2026: పరాభవ నామ సంవత్సరంలో మీ ఆదాయం ఎంత.? ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.?

Ugadi 2026: పరాభవ నామ సంవత్సరంలో మీ ఆదాయం ఎంత.? ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.?
Reading Time: 2 minutes
Ugadi 2026 Parabhava Nama Samvatsaram Rashi Income Predictions

Ugadi 2026 Rashi Phalalu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పరాభవ నామ సంవత్సరంలో గ్రహగతులు కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఆర్థిక యోగాన్ని కలిగిస్తుంటే, మరికొన్ని రాశుల వారిని పొదుపు వైపు మళ్ళిస్తున్నాయి. ఈ ఏడాది జాతక చక్రం ప్రకారం, ధనుస్సు , మీన రాశుల వారు అత్యంత అదృష్టవంతులుగా కనిపిస్తున్నారు. వీరికి ఆదాయం అత్యధికంగా (14) ఉండటమే కాకుండా, చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. ముఖ్యంగా మీన రాశి వారికి అటు ఆదాయంతో పాటు ఇటు రాజపూజ్యం (గౌరవం) కూడా అత్యున్నత స్థాయిలో ఉండటం విశేషం.

అలాగే మేష, వృశ్చిక రాశుల వారికి కూడా ఈ ఏడాది ఆర్థికంగా కలిసిరానుంది. 11 రెట్ల ఆదాయంతో వీరు స్థిరాస్తుల కొనుగోలు లేదా పెట్టుబడుల విషయంలో లాభపడతారు. సింహ రాశి వారికి ఆదాయం, వ్యయం సమానంగా (5) ఉండటంతో వీరి ఆర్థిక పరిస్థితి స్థిరంగా, సమతుల్యంగా ఉంటుంది. వీరితో పాటు మిథున, కన్యా రాశుల వారు 8 రెట్ల ఆదాయంతో పర్వాలేదనిపిస్తారు. అయితే మిథున రాశి వారు అవమాన స్థితి ఎక్కువగా ఉన్నందున మాట తీరులో, వ్యవహారాల్లో కొంత నిగ్రహం పాటించడం అవసరం.

మరోవైపు, వృషభ, తులా రాశుల వారు ఈ సంవత్సరం ఆర్థికంగా అప్రమత్తంగా ఉండాలి. వీరికి ఆదాయం (5) తక్కువగా ఉండి, వ్యయం (14) అత్యధికంగా ఉంది. దీనివల్ల అనవసరపు ఖర్చులు పెరగడం, అప్పులు చేయాల్సిన పరిస్థితులు రావచ్చు. కాబట్టి వీరు పొదుపుపై దృష్టి పెట్టాలి. మకర, కుంభ , కర్కాటక రాశుల వారికి ఆదాయం కనిష్టంగా (2) ఉంది. వీరు వృత్తి, వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి రావచ్చు. మకర రాశి వారు రాజపూజ్యం తక్కువగా ఉండి అవమానం ఎక్కువగా ఉన్నందున ప్రతీ విషయంలోనూ ఆచితూచి అడుగు వేయడం శ్రేయస్కరం.

అయితే.. పరాభవ నామ సంవత్సరం కొందరికి ఆర్థికంగా రాజయోగంలా ఉంటే, మరికొందరికి పొదుపు పాఠాలు నేర్పబోతోంది. మీ రాశి ఫలితాలను బట్టి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే ఈ ఏడాదిని విజయవంతంగా పూర్తి చేయవచ్చు.