Reading Time: < 1 minute
Ts Inter Results 2026 Likely On April 10 Telangana Intermediate Board Update

TS Inter Results 2026: తెలంగాణలో ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 25న ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 18తో ముగియనున్నాయి. ఇంతలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి కీలక అప్డెట్ వచ్చింది. వచ్చే నెల అంటే ఏప్రిల్ 10 తేదీన ఇంటర్ ఫలితాలు విడుదల చేసే యోచనలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. వీలైనంత తొందరగా ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ వైపు పరీక్షలు జరుగుతుండగానే.. మరోవైపు మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 4 నుంచే పరీక్ష పత్రాల వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వీలైనంత త్వరగా మూల్యాంకనం పూర్తి చేసి వెంటనే ఎలాంటి అవకతవకలు లేకుండా ఫలితాలను విడుదల చేయనుంది.

READ MORE: India-Iran: సంక్షోభం వేళ భారత్‌కు శుభవార్త.. ఇరాన్‌తో ఫలించిన జైశంకర్ దౌత్యం

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొదటి సంవత్సరంలో 4,89,126 మంది రెండో సంవత్సరంలో 5,07,949 మంది ఉన్నారు. తొంభై శాతానికి పైగా హాజరు శాతం నమోదవుతోంది. ఇక రాష్ట్రంలో మొత్తం 1,495 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా సమస్యాత్మక పరీక్షాకేంద్రాలు లేవని అధికారులు గతంలోనే వెల్లడించారు. ఇప్పటి వరకు అన్ని సవ్యంగానే జరిగాయి. ఇంకా ఈ నెల 18 వరకు పరీక్షలు జరుగుతాయి కాబట్టి.. ఏమైనా సమస్యలు ఉంటే.. 040-24655027, 9240205555 నంబర్లు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురైతే టెలి-మానస్‌కు నేరుగా ఫోన్‌ చేయవచ్చు. 24 గంటలూ టోల్‌ఫ్రీ నంబరు 14416 అందుబాటులో ఉంటుంది.

READ MORE: WhatsApp: 13 ఏళ్లలోపు పిల్లలు వాట్సాప్ ఉపయోగించవచ్చు.. కానీ