Reading Time: < 1 minute
Ather Ev Scooters Are Cheaper Rs 20 Thousand Savings With Credit Card Cash Discount

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే మంచి ఛాన్స్. ఏథర్ ఎనర్జీ భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ – మార్చి 31, 2026 వరకు మాత్రమే (అంటే ఈ నెల చివరి వరకు). ఈ ఆఫర్లు Rizta, 450 సిరీస్ (450S, 450X మొదలైనవి) మీద అందుబాటులో ఉన్నాయి. ఇది PM E-Drive సబ్సిడీ ముగిసే ముందు (మార్చి 31, 2026) కొనుగోలు చేసేవారికి మంచి అవకాశం.

Also Read:WhatsApp: 13 ఏళ్లలోపు పిల్లలు వాట్సాప్ ఉపయోగించవచ్చు.. కానీ

నివేదికల ప్రకారం, కంపెనీ ఈ నెలలో ఏథర్ స్కూటర్లపై గరిష్టంగా రూ.20,000 వరకు తగ్గింపును అందిస్తున్నారు. ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా ఏథర్ స్కూటర్లపై అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ మార్చి 31, 2026 వరకు చెల్లుతుంది. రూ.20,000 పొదుపులో రూ.10,000 క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్, రూ.6,500 క్యాష్ డిస్కౌంట్, రూ.3,500 ఎక్స్‌టెండెడ్ కాంపోనెంట్ వారంటీ ఉన్నాయి. ఈ తయారీదారు భారతీయ మార్కెట్లో అథర్ రిజ్టా, అథర్ 450X, అథర్ 450 అపెక్స్‌తో సహా పలు విభాగాలలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి.

Also Read:Sai Pallavi : సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ.. ‘ఏక్ దిన్’ ట్రైలర్ రిలీజ్

ధర ఎంత?

ఏథర్ రిజ్టాను కంపెనీ 1.14 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరకు అందిస్తున్నారు. అయితే టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 1.34 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఏథర్ 450 ధర రూ.1.23 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది, టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ.1.60 లక్షలు (ఎక్స్-షోరూమ్), అపెక్స్ వెర్షన్ ధర రూ.1.90 లక్షలు (ఎక్స్-షోరూమ్).