Reading Time: < 1 minute
Woman Arrested After Gunfire At Pop Star Rihanna Beverly Hills Mansion

అమెరికా పాప్ స్టార్ రిహన్న ఇంటిపై కాల్పులు జరిగాయి. రిహన్న లక్ష్యంగా కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: Iran War: ఖార్గ్ ద్వీపాన్ని ముట్టుకోని అమెరికా.. కారణాలు తెలిస్తే షాక్!

ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం 01:15 గంటలకు లాస్ ఏంజిల్స్‌లోని బెవర్లీ హిల్స్ భవనంపై దుండగురాలు కాల్పులు జరిపింది. 35 ఏళ్ల నిందితురాలు కారులోంచి కాల్పులు జరిపింది. AR-15 తరహా ఆయుధంతో కాల్పులు జరిపినట్లుగా లాస్ ఏంజిల్స్ టైమ్స్ నివేదించింది. ఆ సమయంలో రిహన్న ఆ భవనంలోనే ఉందని.. కానీ ఎవరూ గాయపడలేదని అధికారి తెలిపారు. సంఘటనా స్థలంలో అస్సాల్ట్ రైఫిల్ కేసింగ్‌లు దొరికాయని ఒక పోలీసు అధికారి వెల్లడించారు. అనుమానితురాలు తెల్లటి టెస్లా కారు ఉపయోగించినట్లుగా కనిపెట్టారు. అనంతరం కారును గాయకురాలి ఇంటి నుంచి ఎనిమిది మైళ్ల (12 కి.మీ) దూరంలో గుర్తించారు. అక్కడ నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు ఫ్లోరిడాలోని ఓర్లాండోకు చెందినదిగా కనిపెట్టారు.

ఇది కూడా చదవండి: Stock Market: మార్కెట్‌కు భారీ లాభాల పంట.. కారణమిదేనా?

గత సెప్టెంబర్‌లో రిహన్న తన ప్రియుడు రాకీతో మూడవ బిడ్డైన రాకీ అనే అమ్మాయికి జన్మనిచ్చింది. గతంలో ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఫిబ్రవరిలో రిహన్న తన ఇద్దరు కుమారులను కోర్టుకు తీసుకువచ్చింది. మాజీ స్నేహితురాలిపై తుపాకీతో కాల్పులు జరిపినందుకు రాకీ నిర్దోషిగా తేలాడు. బార్బడోస్‌లో జన్మించిన ఈ సెలబ్రిటీ పూర్తి పేరు రాబిన్ రిహన్న ఫెంటీ. 2000ల ప్రారంభంలో పోన్ డి రీప్లే, అంబ్రెల్లా వంటి హిట్‌లతో పాపులర్ అయింది. తొమ్మిది సార్లు గ్రామీ అవార్డులను గెలుచుకుంది. 37 ఏళ్ల రిహన్న నికర విలువ ఒక బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని ఫోర్బ్స్ అంచనా వేసింది.