
Ishan–Abhishek: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ ని చిత్తుగా ఓడించడంలో సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ లో వీరు హాఫ్ సెంచరీలు సాధించారు. ఇక ఫీల్డింగ్ లో ఇషాన్ మెరుపు క్యాచులతో అదరగొట్టగా.. ట్రోఫీని అందుకొన్న తర్వాత ఇషాన్, అభిషేక్ మీడియాతో సరదాగా మాట్లాడారు. ఆ వీడియోను బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఫామ్ గురించి అభిషేక్ శర్మను అడగా.. ఆ క్వశ్చన్ కి ఇప్పుడు సరైన సమాధానం ఇవ్వగలను అని పేర్కొన్నాడు. ఈలోగా ఇషాన్ మధ్యలో కల్పించుకుని.. ప్రశ్నకు నేనూ జవాబు చెప్తాను.. అరే భాయ్ నువ్వు కేవలం ఒక్క నెల మాత్రమే ఫామ్ లో లేవు.. కానీ నేను గత రెండేళ్లు జట్టులో లేను అంటూ ఇషాన్ అనడంతో అభిషేక్ శర్మ ఒక్కసారిగా నవ్వేశాడు. దానికి అభిషేక్ రియాక్ట్ అవుతూ.. అదే నా ఒక్క నెల నీ రెండేళ్లుగా భావించానని ఆన్సర్ ఇచ్చాడు.
అలాగే మీడియాతో మాట్లాడిన ఇషాన్ కిషన్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. జట్టు ఎంపికకు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనకు ఫోన్ చేశారని చెప్పాడు. ప్రపంచకప్ జట్టు గురించి మాట్లాడతారని అనుకుని ఆ కాల్ స్క్రీన్‌షాట్ కూడా తీసుకున్నాను.. కానీ ఆయన నేరుగా ప్రపంచకప్ గెలిపిస్తావా? అని అడిగారు. నేను ‘జట్టులో చోటు ఇస్తారా?’ అని అడిగాను.. దీనికి ఓకే అన్నారని గుర్తు చేశారు. సూర్యకుమార్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను అన్నారు. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 241 పరుగులు చేశాడు. ఫైనల్లో చేసిన అర్ధశతకం టీమ్ ఇండియా విజయంలో కీలకంగా మారింది.
🚨 ABHISHEK & ISHAN FUNNY GEMS ON COMEBACK 🚨
Ishan Kishan – your 1 month form is gone but I’ve been out 3 years from team 🤣
Abhishek Sharma – That 1 month felt like your 1.5 year to me too 🤯
— Kiara (@crickiara) March 9, 2026
అయితే ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్ మొత్తం పెద్దగా రాణించలేకపోయిన అభిషేక్ శర్మ ఫైనల్లో మాత్రం అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 21 బంతుల్లోనే 52 పరుగులు చేసి 250 స్ట్రైక్‌రేట్‌తో న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. అభిషేక్ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ కూడా అదే జోరును కొనసాగించాడు. కేవలం 25 బంతుల్లో 54 పరుగులు చేసి కివీస్ బౌలింగ్‌ను పూర్తిగా దెబ్బతీశాడు. టోర్నమెంట్ మొత్తం కూడా కిషన్ మంచి ఫామ్‌లోనే కొనసాగాడు.
►ALSO READ | Arshdeep Singh: గంభీర్, సంజుని ఆట పట్టించిన అర్ష్‌దీప్ సింగ్..