Reading Time: < 1 minute
Shahid Afridi Praises Team India Bowling Credits Jasprit Bumrah After T20 World Cup Win

T20 World Cup 2026: ఫైనల్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో కప్‌ కొట్టిన టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.. ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కూడా భారత క్రికెట్ జట్టు ఆటతీరును కొనియాడుతూ ప్రశంసలు కురిపించాడు. ICC T20 World Cup 2026 ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ క్రికెట్ జట్టుపై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మార్చి 8న జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి 256 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య చేధనలో కివీస్ తరచుగా వికెట్లు కోల్పోయి భారీ ఓటమిని చవిచూసింది.

భారత్ విజయం అనంతరం పలువురు ప్రస్తుత, మాజీ అంతర్జాతీయ క్రికెటర్లు టీమిండియా ప్రదర్శనను ప్రశంసించారు. ఈ సందర్భంగా అఫ్రిది మాట్లాడుతూ, టోర్నమెంట్ అంతటా భారత్ ఛాంపియన్లలా ఆడిందని పేర్కొన్నారు. జట్టు కలయిక బలంగా ఉండటంతో పాటు బెంచ్ బలం కూడా అద్భుతంగా ఉందని అభిప్రాయపడ్డారు. భారత్ విజయంలో ముఖ్య పాత్ర పోషించిన స్టార్ బౌలర్ బుమ్రాను అఫ్రిది ప్రత్యేకంగా ప్రశంసించాడు. కొత్త బంతితోనైనా, పాత బంతితోనైనా, యార్కర్లు, స్లో బాల్స్‌తోనైనా బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో బుమ్రా ఒకడని అభినందించారు.

అలాగే టోర్నమెంట్‌లో మంచి ప్రదర్శన చేసిన సంజు శాంసన్‌, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌ను కూడా అఫ్రిది ప్రశంసించాడు. ముఖ్యంగా శాంసన్‌ ఓపెనర్‌గా పంపిన నిర్ణయం గొప్ప వ్యూహాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. మొత్తం మీద టోర్నమెంట్ అంతటా భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని, టైటిల్ గెలవడానికి పూర్తి అర్హత ఉందని అఫ్రిది అభినందించారు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది..