Reading Time: < 1 minute
Gas Cylinder Supply Alert Government Clarification India

పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో వంట గ్యాస్ ధరలు పెరుగుతాయని లేదా సరఫరా నిలిచిపోతుందనే వార్తలపై ప్రభుత్వం , అధికారులు కీలక స్పష్టతనిచ్చారు. ఈ యుద్ధ ప్రభావం దేశంలో వంట గ్యాస్ సరఫరాపై ఏమాత్రం ఉండదని, రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా సజావుగానే కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. అయితే, యుద్ధం కారణంగా గ్యాస్ దొరకడం కష్టమవుతుందనే తప్పుడు ప్రచారాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 30 శాతం వరకు అదనంగా పానిక్ బుకింగ్స్ నమోదవుతున్నాయని, అయినప్పటికీ పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాను కొనసాగిస్తున్నామని వారు తెలిపారు. ప్రస్తుతం అదనపు స్టాక్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, సిలిండర్ డెలివరీలు ఎక్కడా ఆటంకం లేకుండా స్మూత్ గా జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

Jasprit Bumrah Bowling: పిసినారి ‘బుమ్రా’.. భారత్ ఫైనల్ చేరడానికి కారణం ఆ మూడు ఓవర్లే!

ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొన్ని నిబంధనలను అమలు చేస్తోంది. సాధారణంగా గ్యాస్ బుకింగ్ కోసం ఉండే 21 రోజుల స్టాండర్డ్ క్యాప్‌ను ప్రస్తుతం ఖచ్చితంగా అమలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోటి 50 లక్షల డొమెస్టిక్ కనెక్షన్లకు, అందులోనూ ముఖ్యంగా ఉజ్వల యోజన కింద ఉన్న 50 లక్షల కనెక్షన్లకు నిరంతరాయంగా సరఫరా అందుతోంది. అయితే, గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో కొత్త కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేసి, కేవలం అత్యవసర అవసరాలకు మాత్రమే అనుమతిస్తున్నారు.

మరోవైపు, సోషల్ మీడియాలో వస్తున్న పెట్రోల్ , డీజిల్ కొరత వార్తలను కూడా ప్రభుత్వం , చమురు సంస్థలు తీవ్రంగా ఖండించాయి. HPCL, BPCL, , IOCL వంటి సంస్థలు దేశంలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

8.12 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ తో వచ్చేస్తున్న OPPO Find N6..!