Reading Time: 2 minutes
Bajaj Px 97 Torque 36l Air Cooler Price Features And Discount Offer On Amazon

Bajaj PX 97: వేసవి కాలం మొదలైతే ఇంట్లో చల్లదనం కోసం చాలా మంది ఏసీ కొనాలని అనుకుంటారు. కానీ అధిక ధరల కారణంగా ప్రతి ఒక్కరికీ అది సాధ్యం కాదు. అలాంటి వారికి మంచి ప్రత్యామ్నాయం ఎయిర్ కూలర్. ముఖ్యంగా వ్యక్తిగత గదులు లేదా చిన్న కార్యాలయాల కోసం సరసమైన ధరలో మంచి పనితీరు అందించే కూలర్‌గా Bajaj PX 97 Torque 36L Air Cooler నిలుస్తోంది. ప్రముఖ సంస్థ బజాజ్ ఎలక్ట్రికల్స్ తయారు చేసిన ఈ కూలర్ వేసవి వేడిని తగ్గించడంలో మంచి పనితీరు చూపుతుంది.

Suryakumar Yadav: సంజు శాంసన్ రాకతో అంతా మారిపోయింది.. ఆ ముగ్గురు జట్టుకు వెన్నెముక!

ఈ కూలర్‌లో 36 లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న ట్యాంక్ ఉంటుంది. దీని వల్ల తరచూ నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి నీళ్లు నింపితే చాలా సేపు కూలింగ్ అందిస్తుంది. రాత్రంతా నిరంతరంగా ఉపయోగించుకునేలా ఇది డిజైన్ చేయబడింది. ఇంకా ఇందులో ప్రత్యేకంగా హెక్సాకూల్ టెక్నాలజీతో కూడిన హనీకాంబ్ ప్యాడ్స్ ఉంటాయి. ఇవి తక్కువ నీటితో కూడా గాలిని వేగంగా చల్లబరచగల సామర్థ్యం కలిగి ఉంటాయి. దీని వల్ల గది త్వరగా చల్లబడుతుంది.

Image (4)

టర్భో ఫ్యాన్ టెక్నాలజీ కారణంగా ఈ కూలర్ గాలిని సుమారు 30 అడుగుల దూరం వరకు వియగలదు. దీంతో చిన్న గదులు లేదా మధ్యస్థ గదుల్లో కూడా చల్లదనం సమంగా వ్యాపిస్తుంది. ఈ కూలర్‌లో ఉన్న దురామెరైన్ పంప్ సాధారణ పంపుల కంటే ఎక్కువ కాలం పనిచేస్తుంది. దీనిపై కంపెనీ రెండు సంవత్సరాల వారంటీ కూడా ఇస్తుంది. దీని వల్ల కూలర్ ఎక్కువకాలం ఉపయోగించుకునేలా ఉంటుంది. ఈ కూలర్‌లో 4-Way Deflection సిస్టమ్ ఉంటుంది. దీని ద్వారా గాలి గదిలోని ప్రతి మూలకు చేరేలా డిజైన్ చేశారు. దీంతో గదిలో ఎక్కడ కూర్చున్నా చల్లదనం అనుభూతి కలుగుతుంది.

Hyderabad: డిజిటల్ అరెస్ట్.. ఏకంగా రిటైర్డ్ జడ్జీనే టార్గెట్ చేసి రూ.1.66 కోట్ల టోకరా..

విద్యుత్ కోతలు ఉన్నప్పుడు కూడా ఈ కూలర్ ఇన్వర్టర్‌పై సులభంగా పనిచేస్తుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాలు లేదా తరచూ పవర్ కట్ ఉండే ప్రాంతాల్లో ఇది మంచి ఎంపికగా ఉంటుంది. ఇక ఈ కూలర్ అసలు ధర సుమారు రూ. 9,790 వరకు ఉంటుంది. అయితే ప్రస్తుతం అమెజాన్ లో భారీ డిస్కౌంట్‌లతో సుమారు రూ. 5,699కే లభిస్తోంది. కొన్ని బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనపు డిస్కౌంట్ లేదా నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా పొందవచ్చు.