Reading Time: < 1 minute
Suryakumar Yadav Targets 2028 Olympics Gold After India T20 World Cup 2026 Win

Suryakumar Yadav: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ను చిత్తు చేసి హ్యాట్రిక్ కప్పులను ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగానికి గురయ్యాడు. గత నెల రోజుల ప్రయాణం తనకు ఎంతో ప్రత్యేకమైందని వెల్లడించాడు. పూర్తి జట్టు కృషి ఈ విజయానికి కారణమని హితవు పలికాడు. ఈ విజయంతోనే తమ లక్ష్యాలు పూర్తి కాలేదని కెప్టెన్ వివరించాడు. ఇప్పుడు తన దృష్టి 2028లో నిర్వహించే ఒలింపిక్స్‌పై ఉందని తెలిపాడు. ఈ ఒలింపిక్ క్రీడల్లో బంగారు పతకం సాధించడమే తదుపరి లక్ష్యమని వెల్లడించాడు. అదే సంవత్సరంలో జరిగే ప్రపంచ కప్ పోటీలోనూ విజయ కేతనం ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

READ MORE: వేసవి వేడికి చవకైన పరిష్కారం.. భారీ డిస్కౌంట్ తో Bajaj PX 97 టార్క్ అందుబాటులో.! ప్రత్యేకతలు, ధర ఇలా..

సూర్య చేసిన ఒలింపిక్స్ వ్యాఖ్యల తర్వాత అందరికీ ఓ డౌట్ వచ్చింది. ఒలింపిక్స్‌లో క్రికెట్ లేదు కాదా? అనే సదేహం వచ్చింది. కానీ.. రెండేళ్ల కిందటే ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు స్థానం కల్పించారు. లాస్‌ ఏంజెలెస్‌ వేదికగా జరగనున్న 2028 ఒలింపిక్స్‌లో (Olympics) క్రికెట్‌ను యాడ్ చేశారు. ఈ మేరకు అప్పట్లో అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆసియా క్రీడల్లో క్రికెట్‌ విజయవంతం కావడం.. చాలా ఏళ్లుగా మెగా ఈవెంట్‌లోనూ ఈ క్రీడను చేర్చాలనే డిమాండ్ల నేపథ్యంలో ఐవోసీ కమిటీ (IOC) దీనికి ఆమోద ముద్ర వేసింది. ఐవోసీ ఆమోద ముద్ర వేసిన నిర్ణయాలను ఒలింపిక్‌ ప్రోగ్రామ్‌ కమిషన్ (OPC) సమీక్షించి ఓటింగ్‌ ద్వారా అధికారికంగా క్రికెట్‌ ఒలింపిక్స్‌లో చేరిపోతుంది. ఇప్పటికే వరల్డ్ కప్‌, ఆసియా కప్, ఛాంపియన్స్‌ ట్రోఫీ వంటి బహుళ దేశాల టోర్నీలను వీక్షించే అభిమానులకు ఒలింపిక్స్‌ రూపంలో మరో మెగా సంబరం ఆస్వాదించే అవకాశం కలిగినట్టే.

READ MORE: Suryakumar Yadav: సంజు శాంసన్ రాకతో అంతా మారిపోయింది.. ఆ ముగ్గురు జట్టుకు వెన్నెముక!