Reading Time: < 1 minute
Bellamkonda Sai Sreenivas Kavya Roka Ceremony Wedding Details

Bellamkonda Sai Sreenivas: టాలీవుడ్‌లో వరుస పెళ్లిళ్లతో సందడి నెలకొంది. యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ ఇప్పటికే ఒక ఇంటివారవ్వగా, ఇప్పుడు ఆ జాబితాలోకి మాస్ అండ్ యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా చేరిపోయారు. ఆయన వివాహ వేడుకలకు సంబంధించిన తొలి అడుగు పడింది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్నారు. ఆదివారం ఉదయం ఆయన నిశ్చితార్థానికి ముందు జరిగే ‘రోకా’ (Roka) వేడుక అత్యంత వైభవంగా జరిగింది.

READ ALSO: IND vs NZ Final T20 World Cup 2026: పిచ్చి కొట్టుడు కొట్టిన అభిషేక్, సంజు, ఇషాన్.. కివీస్ ముందు భారీ టార్గెట్

ఎవరీ కావ్య..
సాయి శ్రీనివాస్ మనసు దోచుకున్న అమ్మాయి పేరు కావ్య. ఈమె హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది కుమార్తె. కావ్యకు సినీ పరిశ్రమతో ఎటువంటి సంబంధం లేదు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని, పెద్దల అంగీకారంతో ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారని సమాచారం. హైదరాబాద్‌లో జరిగిన ఈ రోకా వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. సాయి శ్రీనివాస్‌కు కెరీర్ బిగినింగ్‌లో మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్త తదితరులు ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘అల్లుడు శీను’ చిత్రంతో టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్, ‘జయ జానకి నాయక’, ‘రాక్షసుడు’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ‘కిష్కింధపురి’తో ఆకట్టుకున్న ఆయన, ప్రస్తుతం ‘హైందవ’, ‘టైసన్ నాయుడు’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

READ ALSO: Actor Sivaji: ‘దండోరా’ ఇక్కడితో ఆగే సినిమా కాదు.. మున్ముందు చాలా అవార్డులు వస్తాయి: శివాజీ