Reading Time: < 1 minute
Abhishek Sharmas Destruction Fastest Half Century In World Cup History 51 Runs In 18 Balls

2026 T20 వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్ లో భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంబం లభించింది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ తో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ప్రపంచ కప్ ఆరంభం నుంచి పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న అభిషేక్ ఈ మ్యాచ్ లో రెచ్చిపోయి ఆడాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో కివీస్ బౌలర్లకు చెమటలు పట్టించాడు.

Also Read:IND vs NZ Final T20 World Cup 2026: టాస్ గెలిచిన కివీస్.. బ్యాటింగ్ ఎవరిదంటే?

సిక్సులు, ఫోర్లతో పరుగులు వరద పారించాడు. వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు. అభిషేక్ శర్మ 18 బంతుల్లో 51 పరుగులు చేశాడు. 6 ఫోర్లు, 3 సిక్సర్లతో విరుచుకుపడి అర్ధ సెంచరీని చేరుకున్నాడు. ఎనిమిదో ఓవర్ లో అభిషేక్ శర్మ రచిన్ రవీంద్ర చేతిలో చిక్కుకున్నాడు. టీం ఇండియాకు అభిషేక్ రూపంలో తొలి ఎదురుదెబ్బ తగిలింది. అభిషేక్ 21 బంతుల్లో 52 పరుగులు చేశాడు. 247.62 స్ట్రైక్ రేట్‌తో 52 పరుగులు చేశాడు.

2026 T20 ప్రపంచ కప్ ఫైనల్లో అభిషేక్ శర్మ బ్యాట్ చివరకు గర్జించింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌కు ముందు, అభిషేక్‌ను ప్లేయింగ్ ఎలెవన్ నుండి తొలగించాలని డిమాండ్లు వచ్చాయి. అయితే, పదే పదే వైఫల్యాలు ఉన్నప్పటికీ, జట్టు యాజమాన్యం అతనిపై నమ్మకం ఉంచి ఫైనల్‌ మ్యాచ్ కు అవకాశం ఇచ్చింది. అభిషేక్ కూడా జట్టు యాజమాన్యం నిర్ణయానికి అనుగుణంగా బ్యాటింగ్ తో నిరూపించుకున్నాడు. T20 ప్రపంచ కప్ పవర్‌ప్లేలో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రోహిత్ శర్మతో చేరాడు. ఇషాన్ కిషన్, KL రాహుల్‌లను అధిగమించాడు.