July 8, 2026

Iran Israel War: యుద్ధంలోకి రష్యా ఎంట్రీ.. అమెరికా సంచలన ఆరోపణ..

Iran Israel War: యుద్ధంలోకి రష్యా ఎంట్రీ.. అమెరికా సంచలన ఆరోపణ..
Reading Time: < 1 minute
Russia Intel Iran War Us Military Bases Target Mq9 Drone

Iran Israel War: ఇజ్రాయిల్, అమెరికా కలిసి ఇరాన్‌పై భారీ దాడులు చేస్తున్నాయి. గత శనివారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై వైమానిక దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. మరోవైపు ఇరాన్ గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. కువైట్, బహ్రైయిన్, ఖతార్, యూఏఈలో ఉన్న అమెరికన్ మిలిటరీ స్థావరాలపై దాడులు చేస్తోంది. ఈ ప్రాంతంలోని చమురు సౌకర్యాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది.

Read Also: T20 World Cup 2026 ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ రేస్‌లో ఉంది వీరే .. భారత్‌ నుంచి ఒకేఒక్కడు.. బుమ్రాకు దక్కని చోటు..!

ఈ నేపథ్యంలో ఈ యుద్ధంలోకి ఇరాన్‌కు మద్దతుగా రష్యా ఎంట్రీ ఇచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. రష్యా ఇరాన్‌కు నిఘా సమాచారాన్ని అందిస్తోందని, అమెరికా బలగాలపై ఇరాన్ దాడులు చేయడానికి సహకరిస్తోందని అమెరికా ఆరోపించింది. యూఎస్ యుద్ధ నౌకలు, సైనిక విమానాలు ఎక్కడ ఉన్నాయనే వివరాలను ఇస్తోందని ది వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనంలో పేర్కొంది. ఈ యుద్ధంలో రష్యా సహకారం చాలా ఉందని పేరు వెల్లడించని అమెరికా అధికారులు చెప్పారు.

అయితే, ఈ నివేదికపై అమెరికాలోని రష్యా రాయబార కార్యాలయం స్పందించలేదు. ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలను అత్యంత ఖచ్చితత్వంతో కొడుతోంది. అయితే, ఈ సామర్థ్యం ఇరాన్‌కు లేదని, రష్యా వంటి హైటెక్ నిఘా సామర్థ్యంతోనే సాధ్యమవుతుందని నివేదిక చెప్పింది. ఇరాన్ వైమానిక దళాలు అధునాతన అమెరికన్ MQ-9 డ్రోన్‌ను కూల్చివేసాయి. అయితే, ఈ నివేదికపై అమెరికన్ రక్షణ దళాలు ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇరాన్ యుద్ధంలో రష్యా, చైనా పాత్రపై తమకు ఎలాంటి సమాచారం లేదని యూఎస్ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ అన్నారు.