Reading Time: < 1 minute

UPSC సివిల్ సర్వీసెస్ 2025 ఫలితాలు విడుదల: రిజల్ట్స్‌ ఇలా చెక్ చేసుకోండి!

Caption of Image.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశలు పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు అఫీషియల్ వెబ్‌సైట్‌ upsc.gov.in, upsconline.nic.inలో ఆన్‌లైన్‌లో   చూడొచ్చు. అలాగే  UPSC CSE ఫైనల్ మెరిట్ లిస్ట్  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

UPSC CSE ఫలితాలు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ?
*ముందుగా UPSC వెబ్‌సైట్‌ upsc.gov.in లేదా upsconline.nic.in ఓపెన్ చేయాలి. 

*హోమ్ పేజీలో కనిపించే ‘UPSC CSE Final Merit List PDF’ అనే లింక్‌పై క్లిక్ చేయండి.

*వెంటనే స్క్రీన్ మీద అభ్యర్థుల పేర్లు, రోల్ నంబర్లతో PDF ఫైల్ కనిపిస్తుంది.

* PDFని డౌన్‌లోడ్ చేసుకుని, కావాలనుకుంటే ప్రింట్ అవుట్ తీసి చూసుకోవచ్చు

UPSC CSE ప్రిలిమ్స్ గతంలో మే 25న, మెయిన్స్ ఆగస్టు 22 నుంచి 31 వరకు, ఇంటర్వ్యూలు  ఫిబ్రవరి 27న జరిగాయి. 

UPSC CSE ఫలితాలు 2025 AIR ర్యాంక్స్ :
1. అనుజ్ అగ్నిహోత్రి    (రాజస్థాన్)

2. రాజేశ్వరి సువే ఎం

3. ఆకాన్ష్ ధుల్

4. రాఘవ్ ఝున్‌ఝున్‌వాలా

5. ఇషాన్ భట్నాగర్

6. జిన్నియా అరోరా

7. ఎ.ఆర్. రాజా మొహైదీన్

8. పక్షల్ సెక్రటరీ

9. ఆస్తా జైన్

10. ఉజ్వల్ ప్రియాంక్
 

©️ VIL Media Pvt Ltd.