
అమాయకత్వంలో ఎగ్జైట్మెంట్తో చేసే పనులు కొన్ని కొన్ని సందర్భాల్లో భలే క్యూట్గా అనిపిస్తాయి. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భార్య సాక్షి క్యూట్ వీడియో ఒకటి నెట్టింట ట్రెండ్ అయింది. ఆమె భర్త సీనియర్ క్రికెటర్ కావచ్చు. కానీ.. ఆమెకు క్రికెట్పై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని రూల్ ఏం లేదు. అందువల్లే.. బంప్ క్యాచ్ పట్టుకుంటే ఔట్ అని భావించిన ఆమె తెగ ఎగ్జైట్ అయింది. ఈ వీడియో ఓ రేంజ్లో వైరల్ అయింది. టీమిండియా నిర్దేశించిన 254 పరుగుల టార్గెట్ ఛేజ్ చేసే క్రమంలో 18వ ఓవర్లో బుమ్రా బౌలింగ్లో శామ్ కరన్ బ్యాటింగ్ ఆడుతున్నాడు.
– Bumrah took a Bump Catch
– Sakshi thought it’s out
– She started celebrating
– MS Dhoni saying to her to calm down 🤣😭 pic.twitter.com/QLhjEblz2b— Dank jetha (@Dank_jetha) March 5, 2026
శామ్ కరన్ కొట్టిన బంతి బౌన్స్ అయి ఆ తర్వాత బుమ్రా చేతిలోకి వచ్చింది. ఆ బంతిని బుమ్రా క్యాచ్ పట్టుకోవడంతో ధోనీ భార్య సాక్షి ఔట్ అని సెలబ్రేట్ చేసుకుంది. పైకి లేచి గెంతుతూ పట్టలేని ఆనందంతో భర్త వైపు చూసింది. అయితే.. అది బంప్ క్యాచ్ అని ధోనీకి తెలుసు. అందుకే.. తన భార్య సాక్షి ఎగ్జైట్మెంట్ చూసి ధోనీ నవ్వుతూ అది నాటౌట్ అని.. ఆమె ఎగ్జైట్మెంట్కు కళ్లెం వేశాడు.
ALSO READ : అభిషేక్ను సాగనంపే టైమొచ్చిందా..
Dhoni’s wife got excited …cute 😆#samsunggalaxyai #INDvsENG #T20WC26 pic.twitter.com/X9PlSfuO7D
— The cricket hub (@hitendrapradha6) March 6, 2026
ఈ వీడియో నెట్టింట బీభత్సంగా ట్రెండ్ అయింది. సాక్షి ఎగ్జైట్మెంట్ చూసిన నెటిజన్లకు ముచ్చటేసింది. ఉత్కంఠ పోరులో టీమిండియా గెలిచి ఫైనల్కు వెళ్లాలన్న ధోనీ భార్య తపన, తాపత్రయం అందరినీ ఆకర్షించింది. టీమిండియాను ఎంకరేజ్ చేసేందుకు మాజీ కెప్టెన్ ధోనీ, అతని భార్య సాక్షి టీమిండియా, ఇంగ్లండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ నేరుగా వీక్షించేందుకు వాంఖడే స్టేడియానికి వెళ్లిన సంగతి తెలిసిందే.