July 9, 2026

Saraswathi Review: వరలక్ష్మి శరత్ కుమార్ ‘సరస్వతి’ రివ్యూ.. కోర్ట్‌రూమ్ క్రైమ్ డ్రామా ఎలా ఉందంటే?

Saraswathi Review: వరలక్ష్మి శరత్ కుమార్ ‘సరస్వతి’ రివ్యూ.. కోర్ట్‌రూమ్ క్రైమ్ డ్రామా ఎలా ఉందంటే?
Reading Time: 2 minutes

Saraswathi Review: వరలక్ష్మి శరత్ కుమార్ ‘సరస్వతి’ రివ్యూ.. కోర్ట్‌రూమ్ క్రైమ్ డ్రామా ఎలా ఉందంటే?

Caption of Image.

వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఎస్ సరస్వతి’ (S Saraswathi). తన సోదరి పూజా శరత్ కుమార్‌‌‌‌‌‌‌‌తో కలిసి వరలక్ష్మి నిర్మించింది. శుక్రవారం (2026 మార్చి 6న) సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రకాష్ రాజ్, ప్రియమణి, రాధిక, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించాడు.

సోషల్ మెసేజ్‌‌‌‌తో పాటు ఎంగేజింగ్‌‌‌‌ క్రైమ్ డ్రామాగా వరలక్ష్మి ఈ సినిమాను తెరకెక్కించింది. నటిగా గ్లామర్ రూల్స్‌ను బ్రేక్ చేసిన వరలక్ష్మి, ఇప్పుడు దర్శకురాలిగా ఎలాంటి ఇంపాక్ట్ చూపించిందో రివ్యూలో తెలుసుకుందాం. 

ఎస్ సరస్వతి’ కథ:

లక్ష్మి (వరలక్ష్మి శరత్ కుమార్) ఒక సింగిల్ మదర్‌. కూతురు సరస్వతి(నివేక్ష) తప్ప ఆమెకు మరో లోకం ఉండదు. అయితే, ఓ రోజు కూతురు సరస్వతి పుట్టినరోజు కావడంతో, చాక్లెట్‌ బాక్స్‌ ఇచ్చి స్కూల్‌లో డ్రాప్‌ చేస్తుంది లక్ష్మి. ఇక పని ముగించుకుని సాయంత్రం తిరిగి వచ్చేసరికి స్కూల్‌లో కూతురు సరస్వతి కనిపించదు. స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే.. సరస్వతి అనే పేరుతో ఎవ్వరూ లేరని, లక్ష్మి చెప్పిన క్లాస్‌లో ఏ అమ్మాయి లేరని చెబుతారు.

ALSO READ : పెళ్లి పీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్..

ఈ క్రమంలోనే, అదేరోజు రాత్రి స్కూల్‌ నుంచి లక్ష్మికి ఓ ఫోన్‌ వస్తుంది. తాను ప్రిన్సిపల్ రూమ్ లోనే ఉన్నానని, తనతో పాటు ఇంకో ఇద్దరు అంకుల్స్ కూడా ఉన్నారని, వాళ్ళని చూస్తే భయమేస్తుందని సరస్వతి చెబుతుంది. ఇక ఆ వెంటనే లక్ష్మి అక్కడికి వెళ్లి చూడగా.. కూతురు అత్యాచారానికి గురై చనిపోతుంది. కానీ సాక్ష్యాలు లేక పోలీసులు కేసు నమోదు చేయరు. దీంతో న్యాయం కోసం లక్ష్మి కోర్టును ఆశ్రయిస్తుంది. క్రిమినల్ లాయర్ రామానుజం (ప్రకాశ్ రాజ్) ఆమెకు తోడవుతాడు. అయినప్పటికీ సరైన సాక్ష్యాలు లేక కేసు బలహీనంగా మారుతుంది. చివరికి కేసును కొట్టేయాల్సి వస్తుంది.

ఈ క్రమంలోనే లక్ష్మి తన కూతుర్ని చంపారనే కారణంతో ఓ జడ్జిని, ఐఏఎస్‌ అధికారినిని, పోలీస్‌ని హత్య చేస్తుంది. అసలు ఈ కేసులో దాగున్న నిజం ఏమిటి? సరస్వతిపై అత్యాచారం చేసిన నిందితులు ఎవరు? లక్ష్మి ఎందుకు ఆ హత్యలు చేసింది? చివరికి తన కూతురికి న్యాయం దొరికిందా? లేదా? కేసు విచారణ క్రమంలో.. లాయర్ రామానుజానికి తెలిసిన నిజాలు ఏంటి? ఈ కథలో ప్రియమణి, కిషోర్‌ల పాత్ర ఏంటనేది మిగతా కథ.

విశ్లేషణ: 

సమాజంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణాలను ప్రశ్నించే విధంగా వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ తల్లి–కూతుళ్ల బాండింగ్ చూపించగా, సెకండాఫ్ పూర్తిగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్, కోర్ట్ రూం డ్రామాగా మారుతుంది.

ALSO READ : త్రిషతో విజయ్ చెట్టాపట్టాలు..

సెన్సిటివ్ సబ్జెక్ట్‌ను సైకలాజికల్ కోర్ట్ రూం థ్రిల్లర్‌గా చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. కథలో వచ్చే ట్విస్ట్‌లు, ముఖ్యంగా ప్రీ–ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌ సినిమాపై ఉత్కంఠను రేకేత్తిస్తోంది. పాప కేసు కోసం ప్రకాశ్‌రాజ్‌ పాత్ర రంగంలోకి దిగినప్పటి నుంచి కథలో మరింత సంఘర్షణ మొదలవుతుంది.

అయితే, కోర్టు విచారణ సీన్స్ ఇంకా బలంగా ఉంటే బాగుండేదనే ఫీలింగ్ ఇస్తోంది. ఓవరాల్గా ప్రీక్లైమాక్స్‌ ట్విస్ట్.. క్లైమాక్స్ ఘట్టం సినిమాకు ప్లస్ పాయింట్స్గా నిలిచాయి.

నటీనటులు

లక్ష్మి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ బలమైన నటన చూపించారు. క్రిమినల్ లాయర్ పాత్రలో ప్రకాష్ రాజ్ తన అనుభవంతో పాత్రకు బలం ఇచ్చారు. ప్రియమణి, కిషోర్, మురళీ శర్మ తమ పాత్రల పరిధిలో బాగా నటించారు. చిన్నారి సరస్వతి పాత్రలో నివేక్ష ఆకట్టుకుంది.

టెక్నికల్ అంశాలు

సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కథకు తగినట్లుగా ఉన్నాయి. కొన్ని సన్నివేశాలు భావోద్వేగంగా బలంగా కనిపిస్తాయి. అయితే కథనం కొన్ని చోట్ల నెమ్మదిగా అనిపించే అవకాశం ఉంది. నటిగా, డైరెక్షర్గా వరలక్ష్మి శరత్ కుమార్కి మంచి మార్కులు పడతాయి. 

©️ VIL Media Pvt Ltd.