Reading Time: 2 minutes
Janhvi Kapoor First Look As Achiyamma From Ram Charan Peddi Movie Rc16

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ (Peddi). స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పీరియడ్ డ్రామాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు (మార్చి 6) జాన్వీ పుట్టినరోజును పురస్కరించుకుని, చిత్ర దర్శకుడు బుచ్చిబాబు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ సినిమాలో జాన్వీకి సంబంధించిన బ్యూటిఫుల్ విడియో విడుదల చేశారు.

Also Read : Shiva Rajkumar: పబ్లిక్ ఈవెంట్లలో ‘అసభ్యకర జూమ్’ కల్చర్.. సప్తమి గౌడ పోరాటానికి శివన్న మద్దతు!

ఈ సినిమాలో జాన్వీ కపూర్ ‘అచియమ్మ’ (Achiyamma) అనే పాత్రలో కనిపించబోతోంది. బుచ్చిబాబు తన ట్వీట్‌లో.. ‘నీతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. స్క్రీన్ మీద అచియమ్మగా నీ పవర్‌ఫుల్ అవతారాన్ని ప్రపంచం చూడబోతున్నందుకు నేను చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను’ అంటూ పేర్కొన్నారు. విడుదలైన పోస్టర్‌లో జాన్వీ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. గతంలో శ్రీదేవి – చిరంజీవి జోడీ వెండితెరపై సృష్టించిన మ్యాజిక్ గురించి తెలిసిందే. ఇప్పుడు వారి వారసులు రామ్ చరణ్ – జాన్వీ కపూర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.