Shiva Rajkumar: పబ్లిక్ ఈవెంట్లలో ‘అసభ్యకర జూమ్’ కల్చర్.. సప్తమి గౌడ పోరాటానికి శివన్న మద్దతు!

సినిమా వేడుకలంటే ప్రతిభను, కళను గౌరవించే వేదికలు. కానీ, దురదృష్టవశాత్తూ కొందరు కెమెరామెన్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ చేస్తున్న పని మాత్రం ఇండస్ట్రీలో తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. నటీమణుల ప్రతిభను, వారి సినిమా కష్టాన్ని కాకుండా.. కేవలం వారి శరీర భాగాలను జూమ్ చేస్తూ అసభ్యకరమైన వీడియోలను వైరల్ చేయడంపై కన్నడ హీరోయిన్ సప్తమి గౌడ నిప్పులు చెరిగారు. ఆమె గళానికి కన్నడ కంఠీరవ శివ రాజ్‌కుమార్‌తో పాటు ఆయన కుమార్తె నివేదిత రాజ్‌కుమార్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
Also Read : Avika Gor : తల్లి కాబోతున్న ‘చిన్నారి పెళ్లికూతురు’? వైరల్ అవుతున్న అవికా గోర్ లేటెస్ట్ వీడియో!
ఈ విషయంపై శివ రాజ్‌కుమార్ సోషల్ మీడియా వేదికగా ఒక ఘాటైన లేఖను విడుదల చేశారు.. ‘మహిళలను గౌరవించడం అనేది ఒక సంస్కారం. నటీమణులను కేవలం వస్తువులుగా చూడటం ఆపేయండి’ అని ఆయన హితవు పలికారు. #ActorsNotObjects అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన ఈ ‘జూమ్ కల్చర్’కు తన నిరసనను వ్యక్తం చేశారు. ఇక, నిర్మాత నివేదిత రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘మహిళను కేవలం ఒక శరీరంగా చూడటం మన సమాజ దిగజారుడు తనానికి నిదర్శనం’ అని వ్యాఖ్యానించారు.
సప్తమి గౌడ మాత్రమే కాదు, ఇప్పటికే జాతీయ స్థాయిలో జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, నోరా ఫతేహి వంటి అగ్ర తారలు కూడా ఇటువంటి అసభ్యకర ఫోటోగ్రఫీపై అసహనం వ్యక్తం చేశారు. ప్రొఫెషనల్ జర్నలిజం ముసుగులో జరుగుతున్న ఈ “శరీర ప్రదర్శన” (Body objectification) తక్షణమే ఆగిపోవాలని సప్తమి గౌడ డిమాండ్ చేశారు. ఆమెకు మద్దతుగా రుక్మిణి వసంత్, ఆషిక రంగనాథ్, దివ్య స్పందన వంటి నటీమణులు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.