Reading Time: < 1 minute
Naga Chaitanya Thanks Director Sukumar For Vrushakarma Glimpse Appreciation

యువసామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ (Vrushakarma) ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ గ్లింప్స్ చూసిన ప్రముఖ దర్శకుడు సుకుమార్, చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. సుకుమార్ రైటింగ్స్ కూడా ఈ నిర్మాణంలో భాగస్వామి కావడంతో, ఆయన ఈ అవుట్‌పుట్ పట్ల ఎంతో సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Also Read : Peddi: ‘పెద్ది’ నుంచి ‘అచియమ్మ’గా జాన్వీ కపూర్ క్రేజీ సర్ప్రైజ్!

సుకుమార్ అభినందనలపై నాగచైతన్య ట్విట్టర్ (X) వేదికగా స్పందిస్తూ.. ‘థాంక్యూ సుకుమార్ గారు. మీలాంటి విజనరీ నుంచి ఇలాంటి మాటలు రావడం మాకు ఎంతో గౌరవంగా ఉంది. మీ ప్రశంసలు మాకు ఎంతో స్పూర్తినిస్తాయి’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. కార్తీక్ దండు రూపొందించిన ఈ సూపర్ నేచురల్ ప్రపంచం సుకుమార్‌ను సైతం ఆశ్చర్యపరిచిందని చైతూ ట్వీట్ ద్వారా స్పష్టమవుతోంది. గతంలో కార్తీక్ దండు రూపొందించిన ‘విరూపాక్ష’ చిత్రానికి సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘వృషకర్మ’తో తన శిష్యుడు మరో అద్భుతాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నాడని సుకుమార్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. దీంతో ఈ గురు-శిష్యుల బాండింగ్.. చైతన్యతో వారి అనుబంధం సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.