Reading Time: < 1 minute
Vijay-Trisha: ఒకే కారులో, ఒకే కలర్ డ్రెస్ లో వచ్చిన విజయ్.. త్రిష.. నెట్టింట హల్ చల్

తమిళ సినీ నటుడు విజయ్, నటి త్రిష కృష్ణన్ ఇటీవల ఒక వివాహ రిసెప్షన్‌లో కలిసి కనిపించారు. ఒకే కారులో, ఒకే రంగు దుస్తులలో వారు వేదికకు చేరుకున్నారు. ఈ జంట ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌లలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. తమిళ సినీ నిర్మాత, వ్యాపారవేత్త కల్పతి సురేష్ కుమారుడి వివాహ వేడుకలో వారి హాజరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విజయ్ భార్య సంగీత ఇటీవల ఆయనపై విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ఒక నటితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో త్రిషతో విజయ్ పబ్లిక్ అపియరెన్స్ పలు అనుమానాలకు తావిచ్చింది. విజయ్ రాజకీయ ప్రత్యర్థులకు ఇది ఒక ఆయుధంగా మారిన సమయంలో ఈ సంఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. తమ బంధంపై రాజకీయ విమర్శలకు, వ్యక్తిగత ఆరోపణలకు విజయ్ ఈ విధంగా సమాధానం చెప్పాలనుకుంటున్నారా అనే చర్చ జరుగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Donald Trump: ఇరాన్‌కు మరోసారి ట్రంప్‌ వార్నింగ్

Divvela Madhuri: మరోసారి వివాదంలో దివ్వెల మాధురి

US Iran conflic: ఇరాన్ పై B-2 బాంబర్లతో అమెరికా దాడులు

Teenage Pregnancy: ఏపీలో ఆందోళన కలిగిస్తున్న టీనేజ్ ప్రెగ్నెన్సీ