Reading Time: < 1 minute
Adivi Sesh Rahul Ravindran New Movie Updates Dacoit G2 Release Dates

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, విలక్షణమైన కథలను ఎంచుకోవడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘గూఢచారి 2’ (G2) ‘డెకాయిట్’ చిత్రాలతో బిజీగా ఉండగా, తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ వినిపించిన ఒక వైవిధ్యమైన కథకు శేష్ ఫిదా అయ్యారని సమాచారం.

‘చి ల సౌ’తో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్, ఇటీవల ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన రెండు కొత్త స్క్రిప్ట్‌లను సిద్ధం చేయగా, అందులో ఒక పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌ను శేష్‌కు వినిపించారట. ఈ కథలో ఉన్న కొత్తదనం శేష్‌ను బాగా ఆకట్టుకుందని, అయితే ప్రస్తుతం ఉన్న కమిట్‌మెంట్స్ వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయడానికి కొంత సమయం పట్టవచ్చని తెలుస్తోంది.

మరోవైపు, అడివి శేష్ నటిస్తున్న ‘డెకాయిట్’ (Dacoit) చిత్రంతో ఏప్రిల్ 10, 2026న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే మోస్ట్ అవేటెడ్ స్పై థ్రిల్లర్ ‘G2’ (గూఢచారి 2) ని మే 1, 2026న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక, రాహుల్ రవీంద్రన్ తన తదుపరి చిత్రాన్ని దీక్షిత్ శెట్టితో పూర్తి చేసుకుని, ఆ తర్వాత అడివి శేష్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే అవకాశం ఉంది. ఈ ఇద్దరు టాలెంటెడ్ ఫిలిం మేకర్స్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషనల్ మూవీ రావడం ఖాయం. మొత్తనికి శేష్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నడని మాత్రం అర్థం అవుతుంది.