Reading Time: < 1 minute
Iran Deadly Attacks Target Gulf Oil Refineries

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర అవుతున్నాయి. తగ్గుముఖం పడతాయనుకుంటే రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి. తాజాగా గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు మరింత సీరియస్‌గా మారాయి. బహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడులకు దిగింది. 75 మిస్సైల్స్, 123 డ్రోన్లతో భారీ ఎటాక్ చేసింది. బహ్రెయిన్ పెట్రోలియం రిఫైనరీ మంటల్లో కాలిపోయింది. ఇరాన్ దాడిని ఎదుర్కోవడంలో బ్రహెయిన్ ఎయిర్ డిఫెన్సీ విఫలమైంది.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: విజయ్ – రష్మిక దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి..

ఇక సౌదీ విమానాశ్రయంపై ఇరాన్ 3 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే వాటిని గాల్లోనే అడ్డుకున్నాయి. ఇదిలా ఉంటే ఇరాన్‌పై అమెరికా భూతల దాడులకు సిద్ధపడుతోంది. ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా భారీ దాడులకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులు చేసేందుకు సిద్ధపడుతోంది. తాజా పరిణామాలతో ప్రపంచ చమురు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Road Accident: జాతీయ రహదారిపై అదుపుతప్పిన కారు.. ఓ ప్రాణం బలి!