Reading Time: < 1 minute
Everyone Should Learn From Peddi How To Create Hype With A Hook Step

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం పెద్ది. మైత్రీ మూవీస్, వృద్ధి సినిమాస్ సంయక్తంగా నిర్మిస్తున్న సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే  సినిమా ప్రమోషన్‌లోని ప్రత్యేక హైలైట్ హుక్‌ స్టెప్స్‌తో బుచ్చిబాబు సినిమాపై సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తోన్నాడు.

Also Read : Breaking news : ‘టాక్సిక్’ రిలీజ్ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే

మొదటి సింగిల్ ‘చికిరి’ హుక్ స్టెప్ ఎలాంటి  హైప్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు. ఫస్ట్ సింగిల్ తో మాత్రమే కాకుండా రెండో సింగిల్‌లో కూడా రామ్‌చరణ్ ఎనర్జిటిక్ హుక్‌ స్టెప్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. క్రికెట్ బ్యాక్‌డ్రాప్ కథతో రూపొందిన ఈ సింగిల్‌లో, టీజర్‌లో రామ్‌చరణ్ బ్యాట్‌ను నేలకు కొట్టి సిక్స్ కొట్టిన సీన్ వైరల్ అయ్యింది. రెండో సింగిల్‌లో డిఫరెంట్ స్టైల్లో సిక్స్ బాదుతూ హీరో మరింత ఎక్సైట్‌మెంట్‌ను ఇచ్చాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ‘రై రై రా రా’ సాంగ్ మాత్రమే కనిపిస్తోంది. ప్రతి ఒక్క్కరు ఆ పాటలోని హుక్ స్టెప్ తో రీల్స్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. అయితే ఈ సినిమా నుండి వచ్చిన సాంగ్స్ చూసి హుక్‌ స్టెప్ తో హైప్‌ సృష్టించడం మాత్రమే కాదు, మేమ్స్‌కు ఉపయోగపడేలా ఎలివేషన్ షాట్స్‌ తీసే విధానం కూడా బుచ్చిబాబు నుండి నేర్చుకోవచ్చని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘పెద్ది’ ప్రమోషన్ కొత్తగా డిజైన్ చేయడం ద్వారా ఫ్యాన్స్ మరియు సోషల్ మీడియా అభిమానులను మరింత అలరిస్తోంది.