Reading Time: 2 minutes
Most Wides And No Balls For India In T20is Arshdeep Sing Tops Bumrah Stand At 5

Most Wides & No-Balls for India in T20Is: టీ20 ఫార్మాట్‌లో బౌలర్ వేసే ప్రతి బంతి కీలకమే. ఒక వైడ్ లేదా నోబాల్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తాయి. వైడ్ లేదా నోబాల్ కారణంగా మ్యాచ్ ఓడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. స్టార్ బౌలర్లు కూడా ఏదో ఓ సందర్భంలో వైడ్ లేదా నోబాల్ వేస్తుంటారు. ఆ లిస్టులో భారత అటగాళ్లు చాలా మందే ఉన్నారు. టీ20 ప్రపంచ కప్‌ 2026 నేపథ్యంలో భారత జట్టు తరఫున అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక వైడ్లు, నోబాల్స్ వేసిన బౌలర్ల జాబితా ఆసక్తికరంగా ఉంది.

అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక వైడ్లు, నోబాల్స్ వేసిన జాబితాలో స్టార్ పేసర్ అర్షదీప్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. మొత్తం 119 ఎక్స్‌ట్రాలు ఇచ్చాడు. ఇందులో 102 వైడ్లు ఉండగా.. 17 నోబాల్స్ ఉన్నాయి. డెత్ ఓవర్లలో ఎక్కువగా బౌలింగ్ చేయడం వల్లే ఈ సంఖ్య ఎక్కువగా నమోదైనట్టు క్రికెట్ నిపుణులు అంటున్నారు. రెండో స్థానంలో హార్దిక్ పాండ్య ఉన్నాడు. హార్దిక్ మొత్తంగా 114 ఎక్స్‌ట్రాలు ఇచ్చాడు. అందులో 110 వైడ్లు, 4 నోబాల్స్ ఉన్నాయి. ఆల్‌రౌండర్‌గా కీలక సమయాల్లో బంతి పట్టడం వల్ల ఒత్తిడిలో ఈ ఎక్స్‌ట్రాలు వచ్చాయి.

Also Read: AP Legislative Council: నేటి నుంచి శాసనమండలి సమావేశాలు.. లడ్డూ అంశంపై మళ్లీ హాట్ టాపిక్!

మూడో స్థానంలో వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. అతను మొత్తం 76 వైడ్లు వేశాడు. స్వింగ్ బౌలింగ్‌లో నైపుణ్యం కలిగిన భువీ కొన్ని సందర్భాల్లో లైన్ తప్పడంతో ఈ సంఖ్య పెరిగింది. నాలుగో స్థానంలో మాజీ స్పిన్నర్ రవి అశ్విన్ ఉన్నాడు. యాష్ 55 వైడ్లు, 4 నోబాల్స్ కలిపి 59 ఎక్స్‌ట్రాలు ఇచ్చాడు. స్పిన్నర్ అయినప్పటికీ కీలక మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేస్తూ ఈ గణాంకాలు నమోదు చేశాడు. ఐదో స్థానంలో జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. 45 వైడ్లు, 11 నోబాల్స్‌తో మొత్తం 56 ఎక్స్‌ట్రాలు ఇచ్చాడు. యార్కర్లు వేయడంలో నైపుణ్యం ఉన్న బుమ్రా కొన్నిసార్లు నోబాల్స్ రూపంలో అదనపు పరుగులు ఇచ్చాడు.

మణికట్టు సిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 56 ఎక్స్‌ట్రాలతో ఈ జాబితాలో చోటు సంపాదించాడు. యూజీ 51 వైడ్లు, 5 నోబాల్స్ వేశాడు. మధ్య ఓవర్లలో వికెట్లు తీసే క్రమంలో రిస్క్ తీసుకోవడం వల్ల వైడ్లు వచ్చాయి. టీ20ల్లో బౌలర్లకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ గణాంకాలు వారి ప్రతిభను ఏమాత్రం తగ్గించవు. మ్యాచ్‌లను గెలిపించిన ఎన్నో అద్భుత ప్రదర్శనలు కూడా వీరి ఖాతాలోనే ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌లో వైడ్లు, నోబాల్స్ వేయడం సాధారణమే.