Reading Time: < 1 minute
Rahul Gandhi Visits Hyderabad Today To Attend Dcc Presidents Training Camp In Vikarabad

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఉదయం 9:30 గంటలకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, శంషాబాద్ విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నారు. అక్కడ ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలకనున్నారు. విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి కలిసి వికారాబాద్ జిల్లాకు బయలుదేరనున్నారు.

T20 WC 2026 Semi Final Schedule: సెమీస్‌ షెడ్యూల్‌.. భారత్‌ ప్రత్యర్థి, వేదిక డీటెయిల్స్ ఇవే!

అక్కడ అనంతగిరిలో తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల కోసం నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ శిక్షణా శిబిరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. ఇవాళ్టితో ఈ తరగతులు ముగియనున్నాయి. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత కేసి వేణు గోపాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ ముగింపు సమావేశంలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. పార్టీ బలోపేతం, కేడర్ శిక్షణ, రాబోయే రాజకీయ వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల నుండి సమాచారం.

Tirumala: తిరుమల వెళ్లే వారికి అలర్ట్.. రేపు చంద్రగ్రహణం కారణంగా ఆలయం మూసివేత