Reading Time: < 1 minute
Alert For Tirumala Devotees Tirumala Temple To Remain Closed Tomorrow Due To Lunar Eclipse

Tirumala: తిరుమలలోని శ్రీనివాసుడి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్.. రేపు చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, రేపు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు మొత్తం రద్దు చేశారు. ఇవాళ రాత్రి వరకు మాత్రమే భక్తులను క్యూ లైనులోకి అనుమతి ఇవ్వనున్నారు. సర్వదర్శనం భక్తులకు ఇవాళ తిరుపతిలో జారీ చేసే దర్శన టోకెన్లు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

Read Also: The IQ Era థీమ్‌తో MWC 2026 నేడే ప్రారంభం.. ఏ కొత్త ఫోన్ల లాంచ్‌ కానున్నాయంటే..!

మరోవైపు, తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు అన్ని నిండిపోయి వెలుపల క్యూ లైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. ఇక టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. అలాగే, నిన్న శ్రీవారిని 83,122 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,054 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా, 4.49 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ పేర్కొనింది.