Reading Time: < 1 minute
US-Israel-Iran Conflict: ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్.. మరోవైపు ఇరాన్ బాంబుల వర్షం!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దళాలు, మరోవైపు ఇరాన్ మధ్య భీకర దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ అధినేత అయతొల్లా అలీ ఖమేనీని హతమార్చిన తర్వాత కూడా, ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించి, మిసైళ్లు, డ్రోన్లతో దాడులు తీవ్రతరం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్లోని సైనిక స్థావరాలు, డ్రోన్ కేంద్రాలు, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌పై వైమానిక దాడులు నిర్వహిస్తుండగా, ఇరాన్ ఇజ్రాయెల్, అమెరికా ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలతో పాటు దుబాయ్, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, సౌదీ సహా 10 దేశాలపై ఇరాన్ మిసైళ్ల వర్షం కురిపించింది. చైనా శాటిలైట్ల సాయంతో ఈ దాడులు జరిపినట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

US-Iran War: యుద్ధం వల్ల భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు

T20 World Cup 2026: ఇండియా ఘన విజయం.. టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌కు భారత్‌