Reading Time: < 1 minute

జగిత్యాల D Mart లో గొడవ.. షాపింగ్ కి వచ్చిన యువతిని వేధించిన పోకిరి… చివరికి..

Caption of Image.

జగిత్యాల జిల్లా డీమార్ట్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. షాపింగ్ కి వచ్చిన ఓ యువతిని చేతివేళ్ళతో అసభ్యకరంగా సైగలు చేస్తూ వేధించాడు ఓ యువకుడు. దీంతో ఆ యువకుడిని డీమార్ట్ ఆవరణలో చితకబాదారు  యువతి తండ్రి, బంధువులు. ఆదివారం ( మార్చి 1 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల పట్టణంలో ఉన్న డీమార్ట్ లో ఓ యువతిని వేధించాడు ఓ యువకుడు.చేతివేళ్ళతో అసభ్యకరంగా సైగలు చేస్తూ యువతిని ఇబ్బంది పెట్టాడు యువకుడు.

యువకుడు వేధిస్తున్న విషయం తన తండ్రికి చెప్పింది యువతి. ఈ క్రమంలో యువకుడిని పట్టుకున్న ఆమె తండ్రి… బంధువులతో కలిసి అతన్ని చితకబాదారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ గుమిగూడిన జనాన్ని చెదరగొట్టి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు.

ఘటన జరిగిన సమయంలో డీమార్ట్ లో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీమార్ట్ ఆవరణలో గొడవ పడొద్దని అడ్డు చెప్పిన సిబ్బందికి, యువతి తల్లిదండ్రులకు మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. షాపింగ్ కి వచ్చినవారి భద్రత సిబ్బంది బాధ్యత కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు యువతి తల్లిదండ్రులు. ఇలాంటి పనులు మళ్ళీ చేయకుండా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధితురాలి బంధువులు. 
 

©️ VIL Media Pvt Ltd.