Reading Time: < 1 minute
Pakistan Afghanistan War Taliban Suicide Squads Border Clash Updates

Pakistan Afghanistan War: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం భీకరంగా మారింది. ఈ రోజు తెల్లవారుజామున పాకిస్తాన్ ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్‌తో సహా పలు నగరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల తర్వాత తాలిబాన్ల నుంచి ప్రతీకార దాడులు మొదలయ్యాయి. రెండు దేశాల సరిహద్దుల్లోని ఘర్షణలు తీవ్రమయ్యాయి. పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలపై దాడులు నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే, తాలిబాన్లు ఆత్మాహుతి దాడులకు పాల్పడే ‘‘సూసైడ్ స్వ్కాడ్’’లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అక్కడి స్థానిక మీడియా ఆత్మాహుతి దాడులు చేసే బెటాలియన్‌లను ఫోటోలను షేర్ చేసింది. బాంబర్లు పేలుడు దుస్తులు, కార్ బాంబులతో సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. తాలిబాన్ డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాత్, పాక్టియా, పాక్టికా, ఖోస్ట్ ప్రావిన్సులలో డ్యూరాండ్ లైన్ – పాకిస్తాన్ సరిహద్దు, వివిధ ప్రాంతాలలో తీవ్రమైన దాడి, ప్రతీకార కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

Read Also: Virat Kohli: సచిన్ vs విరాట్.. ఇద్దరిలో ఎవరు బెస్టో చెప్పేసిన కోహ్లీ!

పాక్ ఆఫ్ఘాన్ ఘర్షణల్లో వందలాది మంది మరణించినట్లు రెండు దేశాలు ప్రకటించుకున్నాయి. 133 ఆఫ్ఘన్ తాలిబాన్ యోధులు మరణించారని మరియు 200 మందికి పైగా గాయపడ్డారని, 27 పోస్టులు ధ్వంసమయ్యాయని మరియు తొమ్మిది మంది పట్టుబడ్డారని పాకిస్తాన్ తెలిపింది. అయితే, 55 పాకిస్తాన్ సైనికులు మరణించారని, 19 పోస్టులు స్వాధీనం చేసుకున్నారని తాలిబాన్ పేర్కొంది, నంగర్హార్‌లో ఎనిమిది మంది ఆఫ్ఘన్ యోధులు మరణించారని తాలిబాన్ పేర్కొంది.

ఇప్పటికే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్‌పై ‘‘బహిరంగ యుద్ధ ప్రకటన’’ చేసింది. పాకిస్తాన్ లోపల దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు ఆఫ్ఘాన్ ఆశ్రయం ఇస్తుందని ఆ దేశం ఆరోపిస్తోంది. దీనికి తోడు రెండు దేశాల సరిహద్దు వివాదమైన ‘‘డ్యూరాండ్ లైన్’’ కూడా ఘర్షణకు కారణమవుతోంది. డ్యూరాండ్ లైన్‌ను ఆఫ్ఘనిస్తాన్ శతాబ్ధకాలంగా ఒప్పుకోవడం లేదు. పాక్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని చాలా ప్రాంతాలు తమవే అని చెప్పుకుంటోంది.