
రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ బ్రాండ్ ఫ్లయింగ్ ఫ్లీ ఎలక్ట్రిక్ బైక్ ‘సీ6’ హైదరాబాద్ మార్కెట్లోకి వచ్చేసింది. ఎక్స్ షోరూమ్ ధర రూ.2.79 లక్షలు. బ్యాటరీ కిరాయి విధానంలో అయితే రూ.రెండు లక్షలు. ఒకసారి చార్జ్చేస్తే 154 కిలోమీటర్లు వెళ్తుంది.
టాప్ స్పీడ్ గంటకు 115 కిలోమీటర్లు. కార్బన్ బెల్ట్ డ్రైవ్ సిస్టమ్, కార్నరింగ్ ఏబీఎస్, కీలెస్ స్టార్ట్, ఎన్‌ఎఫ్‌సీ టెక్నాలజీ దీని ప్రత్యేకతలు. ఎలక్ట్రిక్ బైకుల అమ్మకాల కోసం హైదరాబాద్లో నాలుగు ఔట్లెట్లను కూడా ప్రారంభించామని ఫ్లయింగ్ ఫ్లీ తెలిపింది.