Reading Time: 2 minutes

ప్రభాస్ ‘సాలార్’ ను కాపీ కొట్టిన పాకిస్థాన్.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్!

Caption of Image.

ఇండియన్ చిత్రాలకు విదేశీ గడ్డపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా బాలీవుడ్ చిత్రాలకు పాకిస్థాన్ సినీ ప్రియులు ఫిదా అవుతుంటారు. ఇప్పుడు టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్  ను కూడా ఫాలో అవుతున్నారు పాక్ సినీ ప్రేక్షకులు. మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘సాలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్’ మూవీ బాక్సాఫీస్‌ వద్ద సునామీ సృష్టించింది. ఆ సినిమాలోని డార్క్ థీమ్, పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్సులు, ప్రభాస్ మ్యాసివ్ కటౌట్ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 

అయితే లెటస్ట్ గా ఈ సినిమాలోని ఒక ఐకానిక్ యాక్షన్ సీన్‌ను యాజ్ ఇట్ ఈజ్‌గా దింపేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ‘పాకిస్థాన్ వాళ్లు కూడా మన సాలార్‌ను కాపీ కొట్టేశారా?’ అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. కానీ సీన్ కట్ చేస్తే… ఇది ఏ పాకిస్థానీ సినిమా సీనో లేదా ఎఐ (AI)తో క్రియేట్ చేసిన ఫుటేజో కాదు. పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా కాంటెంట్ క్ర్రియేటర్ హసీబ్ బిలాల్ చేసిన స్టంట్ ఇది.

హసీబ్ బిలాల్‌కు సౌత్ ఇండియన్ మాస్ సినిమాలంటే పడిచచ్చేంత పిచ్చి. టాలీవుడ్, కాలీవుడ్ హిట్ సినిమాల్లోని ఐకానిక్ సీన్స్, మాస్ పాటలను రీక్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అతని అలవాటు. అందులో భాగంగానే, ప్రభాస్, శ్రుతి హాసన్‌లపై వచ్చే  యాక్షన్ సీన్‌ను హసీబ్ బిలాల్ మక్కీకి మక్కీ దించేసాడు. ప్రభాస్ డ్రెస్సింగ్ స్టైల్, నడిచే విధానం, బాడీ లాంగ్వేజ్, ఆఖరికి ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ విజువల్స్, స్లో-మోషన్ షాట్స్‌ను కూడా అలాగే రీక్రియేట్ చేశాడు.

ALSO READ: అమాయకుల నమ్మకమే నందన పెట్టుబడి..

ఈ వీడియో ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ చాలా పర్ఫెక్ట్‌గా ఉండటంతో, మొదట చాలామంది దీనిని ఒక పాకిస్థానీ ఫీచర్ ఫిలిం అనుకుని పొరబడ్డారు. బిలాల్ ఇదివరకే ‘సాలార్’ పై చేసిన మరికొన్ని వీడియోలు కూడా నెట్టింట మిలియన్ల వ్యూస్‌తో ట్రెండ్ అయ్యాయి. మొత్తానికి రెబల్ స్టార్ రేంజ్, డార్లింగ్ మేనియా సరిహద్దులు దాటి పాకిస్థాన్ వీధుల్లో కూడా ఏ రేంజ్‌లో ఊపేస్తుందో ఈ వైరల్ క్లిప్ మరోసారి నిరూపించింది..
 

©️ VIL Media Pvt Ltd.