Reading Time: < 1 minute
Mumbai Python Rescue 7 Foot Python Car Bonnet Dahisar

Python in Car: బైకులో సీటు కింద, హెల్మెట్‌లో పాములు దూరిన సంఘటనలు చాలానే చూశాం. కానీ ముంబైలో ఓ కారులో ఏకంగా 7 అడుగుల భారీ కొండచిలువ కనిపించడంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ముంబైలోని దహిసర్ వెస్ట్‌లో ఈ ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఓ నివాసం ప్రాంతంలో పార్క్ చేసిన కారు ఇంజన్ బానెల్‌లో పాము చక్కగా పడుకుని ఉంది. ఈ ఘటన కందర్‌పాడాలోని బాపు బాగ్వే రోడ్ సమీపంలోని మహేశ్వర్ బిల్డింగ్ వద్ద జరిగింది.

శనివారం కారు కిందగా ఒక పాము పాకుతూ వెళ్లడాన్ని కొంత మంది గమనించారు. దీంతో వెంటనే వైల్డ్ లైఫ్ రెస్క్యూ టీమ్‌కు సమాచారం ఇచ్చారు. రెస్క్యూ నిపుణుడు సమీర్ గుప్తా, కారు బోనెట్ తెరిచి చూడగానే ఇంజన్ పై భాగంలో కొండచిలువ చుట్టుకుని కనిపించింది. ఎంతో జాగ్రత్తగా దాన్ని బయటకు తీశారు. రెస్క్యూ తర్వాత కొండచిలువకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లో విడిచిపెట్టారు.

కార్లు ఇంజన్లు, బైక్ సీటు కింద ప్రదేశాలు పాములు దూరడానికి అనువుగా ఉండటంతో పాటు చీకటి ప్రదేశాలు కావడంతో పాములు ఇష్టపడుతాయని నిపుణులు చెబుతున్నారు. కారు చాలాసేపు పార్క్ చేసి ఉంటే ఇంజన్ కంపార్ట్మెంట్‌, టైర్లు, వీల్ ఆర్చ్‌ ప్రాంతాలను పరిశీలించిన తర్వాతే స్టార్ట్ చేయడం మంచిదని సూచిస్తున్నారు.