Reading Time: 2 minutes

విమానంలో గొడవ చేస్తున్నాడని.. ఇలా కట్టేశారు.. చేయి, కాళ్లు, మూతికి ప్లాస్టర్లు

Caption of Image.

డల్లాస్ నుంచి నెవార్క్ వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ ప్రయాణికుడు విపరీతంగా  హంగామా చేయడంతో, సిబ్బంది, తోటి ప్రయాణికులు కలిసి అతన్ని సీటుకు డక్ట్ టేప్‌తో  కదలకుండా కట్టిపడేసారు. విమానం బయలుదేరిన రెండు గంటల తర్వాత ఈ గొడవ మొదలైంది. ప్రయాణికులంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో, సడన్‌గా ఒక వ్యక్తి ఎలాంటి చప్పుడు  లేకుండా పక్క సీటులో కూర్చున్న వ్యక్తి పై దాడి చేశాడు.

సిబ్బంది, ప్రయాణికుల సాహసం:
ఈ గొడవను చూసి రిచర్డ్ ఓలెనిక్, జువాన్ మెజియా అనే మాజీ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వెంటనే అప్రమత్తమైయ్యారు. విమాన సిబ్బంది ఆ వ్యక్తిని కంట్రోల్ చేయడానికి, సీటులో  కదలకుండా ఉండటానికి సీటుతో గట్టిగా ‘డక్ట్ టేప్’ చుట్టి కట్టేశారు. ఓలెనిక్ తీసిన ఫోటోలో ఆ వ్యక్తి చేతులు, శరీరం చుట్టూ టేప్ చుట్టి ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది.

విమానం దారి మళ్లింపు:
ఈ గొడవకు ముందు, విమాన సిబ్బంది ఆ ప్రయాణికుడిని కాంట్రోల్ చేసేందుకు ప్రయత్నించినా అతను వినలేదు. అంతేకాకుండా, సిబ్బందిపై అసభ్యకరంగా, జాతి వివక్షతో కూడిన దూషణలకు పాల్పడ్డాడు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పైలట్లు విమానాన్ని వెంటనే మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత   విమానం ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించి నెవార్క్‌కు చేరుకుంది.

ALSO READ : జీ మీడియా అధినేతపై సుభాష్ చంద్రపై CBI కేసు

ఎఫ్‌బిఐ దర్యాప్తు:
ప్రయాణికులు, సిబ్బంది భద్రతకే మా మొదటి ప్రాధాన్యత అని అమెరికన్ ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. ఇలాంటి హింసాత్మక ప్రవర్తనను ఎంతమాత్రం సహించబోమని తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఈ ఘటనపై ఎఫ్‌బిఐ (FBI) రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది. సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని, యూఎస్ అటార్నీ కార్యాలయంతో మాట్లాడి ఆ వ్యక్తిపై ఫెడరల్ చట్టాల ప్రకారం అభియోగాలు మోపే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కోర్టులో నిరూపితమయ్యే వరకు ఇవి ప్రస్తుతానికి ఆరోపణలు మాత్రమేనని స్పష్టం చేశారు.

 

©️ VIL Media Pvt Ltd.