
బ్లూ టూత్ స్పీకర్లు, ట్రూ వైర్‌లెస్ స్టీరియో (టీడబ్ల్యూఎస్),ఏఐ ఇయర్‌బడ్స్, సౌండ్ బార్ల లాంటి ఆడియో ప్రొడక్ట్‌లతో కస్టమర్లకు చేరువైన హైదరాబాద్ కంపెనీ మివి, త్వరలో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది.
Mivi స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 24, 2026న విడుదల కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ను ఫ్లిప్‌కార్ట్ అమ్మనుంది. Mivi అధికారిక ఎక్స్ పేజ్లో ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడింది. ఈ స్మార్ట్ ఫోన్ లుక్పై కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చింది.
Near, far, wherever you are, we probably have service there. 😌
Dropping on 24th Sep#MiviOne pic.twitter.com/UFnhVqDzsA
— Mivi (@MiviOfficial) September 5, 2026
MIVI ONE 5G పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అందుబాటులో ఉండనుంది. పోస్టర్ చూస్తే ఈ మివి ఫోన్ గ్రీన్ కలర్ వేరియంట్‌లో ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. ఇతర రంగుల్లో ఉండే అవకాశం లేకపోలేదు. ఫీచర్లు, ధర వంటి కీలక వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ.. ధర బడ్జెట్ లోనే ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. రూ. 15 వేలు.. అంతకంటే తక్కువలోనే ఈ స్మార్ట్ ఫోన్ ధర ఉండొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ALSO READ : బ్యాంకులో తాకట్టుపెట్టిన గోల్డ్ దొంగిలించబడితే కస్టమర్‌కి ఎంత చెల్లిస్తారు?
Mivi కంపెనీ ఫౌండర్లు తెలుగు వాళ్లే కావడం విశేషం. మిధుల దేవభక్తుని, కందుల విశ్వనాథ్ పేరుతోనే Mivi అనే బ్రాండ్ నేమ్తో ఈ కంపెనీ మొదలైంది. సక్సెస్ ఫుల్గా నడుస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీలో 15 వందల మందికి పైగానే పనిచేస్తున్నారు. ఆడియో ప్రొడక్టులతో మార్కెట్లో పరపతి పెంచుకున్న కంపెనీలు ఒక్కొక్కటిగా స్మార్ట్ ఫోన్ల తయారీ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. స్మార్ట్‌వాచ్‌ల బ్రాండ్ బోల్ట్ కూడా ‘బోల్ట్’ పేరిట రెండు స్మార్ట్‌ఫోన్లు బోల్ట్ ఎవో 4జీ, బోల్ట్ ఏస్ 5జీలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండటం గమనార్హం.
Every moment captured like it’s the one! 📸
Dropping 24 Sep#MiviOne pic.twitter.com/HcHVdo6XZK— Mivi (@MiviOfficial) September 3, 2026