Reading Time: < 1 minute

హైదరాబాద్ లో హోం ఫర్నీచర్ సెల్లర్.. స్టాన్లీ హోమ్ స్టోర్ షురూ

Caption of Image.
  • ప్రారంభించిన మంత్రి శ్రీధర్​ బాబు

హైదరాబాద్​, వెలుగు: హోంఫర్నిచర్ సెల్లర్ ​స్టాన్లీ తన లగ్జరీ హోమ్​ స్టోర్​ను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం ప్రారంభించింది. ఆరు అంతస్తుల్లో ఈ భారీ ఫ్లాగ్​షిప్​ స్టోర్ ఏర్పాటయింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  ఫర్నిచర్, కిచెన్స్​, వార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోబ్లు, లైటింగ్, డెకార్, ఆర్ట్ వంటి అన్ని రకాల లగ్జరీ వస్తువులు ఇక్కడ లభిస్తాయి. జర్మనీ, జపాన్, స్పెయిన్, బెల్జియం దేశాలకు చెందిన ప్రముఖ బ్రాండ్ల సహకారంతో ఈ ఉత్పత్తులను రూపొందించామని కంపెనీ చైర్మన్ సునీల్ సురేష్ పేర్కొన్నారు

©️ VIL Media Pvt Ltd.