Reading Time: < 1 minute

‘నువ్వు అత్తాపూర్‌కు రారా.. నీళ్ల ట్యాంకర్ దగ్గర ఆడోళ్లతో కొట్టిస్తా’.. నవ్వులు పూయిస్తున్న ‘డెలులు’ మూవీ టీజర్ !

Caption of Image.

యువతలో ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతున్న సరికొత్త పదం ‘డెలులు’ (Delulu). ఇదే క్యాచీ టైటిల్‌తో ఇప్పుడు టాలీవుడ్‌లో ఒక క్రేజీ అండ్ ఫన్ రైడ్ సినిమా సిద్ధమవుతోంది. ప్రీతం కస్తూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బ్యానర్‌పై సంకీర్త్ కొండ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

బ్రేకప్ దేవా అనే డిఫరెంట్ డైలాగ్‌తో స్టార్ట్ అయ్యే ఈ టీజర్, ఆద్యంతం అవుట్ అండ్ అవుట్ హస్యంతో, యూత్‌ను కట్టిపడేసే డైలాగ్స్‌తో నిండిపోయింది. ఆడదానివైన నువ్వు.. చీప్‌గా ఓ మగాడి కోసం మారతావా అంటావా.. సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా నీకు, “నువ్వేమైనా ఫాదర్ ఆఫ్ ఇండియానా?, “నువ్వు అత్తాపూర్‌కు రారా.. నీళ్ల ట్యాంకర్ దగ్గర ఆడోళ్లతో కొట్టిస్తా” అంటూ సాగే డైలాగులు యూత్, మాస్ ఆడియెన్స్‌కు విపరీతంగా నచ్చేస్తున్నాయి.

ఒక ఇంట్లో జరిగే సరదా సంఘటనలు, నేటితరం జంటల మధ్య ఉండే కన్‌ఫ్యూజన్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కలబోసి ఈ చిత్రాన్ని రూపుదిద్దినట్లు టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. విజయ్ రాజ్‌కుమార్ కథ అందించడంతో పాటు నటుడిగా మెరవగా, వేణి రావు, అఖిల్ జాక్సన్, సాయి ప్రసన్న, శ్రీ రామ మండవ, అభినయ్ తుల ఈ వినోదాత్మక చిత్రంలో కీలక పాత్రల్లో అలరించనున్నారు.

►ALSO READ | యూత్‌ఫుల్ లవ్ స్టోరీ ‘డియర్ హార్ట్’.. మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన డైరెక్టర్ సాయి రాజేష్

సాంకేతికంగా జై రాజ్ నాయుడు విజువల్స్, ఆది చెబ్రోలు అందించిన క్రేజీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, హరికృష్ణ కురపాటి షార్ప్ ఎడిటింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌తో పాటు, ఈ ఫన్-ఫిల్డ్ టీజర్ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడానికి వస్తున్న ఈ ‘డెలులు’బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

 

©️ VIL Media Pvt Ltd.