
సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని తల్లిని రోకలిబండతో బాది చంపేశాడు ఓ కిరాతకుడు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెంలో జరిగింది ఈ దారుణం. శుక్రవారం ( సెప్టెంబర్ 4 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి…
రఘునాథపాలెం గ్రామానికి చెందిన షేక్ సుభాని తాగుడుకు బానిసయ్యాడు. తల్లిని తరచూ వేధిస్తూ ఉండేవాడు సుభాని. ఇవాళ కూడా తాగుడుకు డబ్బులు ఇవ్వాలని తల్లితో గొడవకు దిగాడు. తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆవేశంతో రోకలిబండతో విచక్షణారహితంగా బాదాడు సుభాని. ఈ క్రమంలో తీవ్ర గాయాలైన తల్లి అక్కడికక్కడే మృతి చెందింది.
►ALSO READ | హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన చికిత్స… కడుపులో బ్లేడ్ ముక్కలు తొలగించారు..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.