Reading Time: 2 minutes

సెప్టెంబర్‌ నెలలో కొత్త కారు లేదా బైక్ కొంటున్నారా..? ఈ రోజుల్లో కొంటే అంతా శుభమే, కలిసొస్తుంది !

Caption of Image.

కొత్త కారు లేదా బైక్ కొనడం అనేది ప్రతి కుటుంబంలో ఒక పెద్ద పండగ లాంటిది. అది మొదటి వాహనం అయినా లేదా ఇంకోటి కొంటున్నా, మనవాళ్లు చాలామంది మంచి ముహూర్తం చూసుకునే డెలివరీ తీసుకుంటారు.

మీరు కూడా సెప్టెంబర్ 2026లో కొత్త వాహనం కొనాలని అనుకుంటే, జ్యోతిష్యులు  చెప్పిన దాని ప్రకారం ఈ నెలలో 5 మంచి రోజులు ఉన్నాయి.  భద్ర కాలం, రాహుకాలం లేని సమయంలో ఈ కింద పేర్కొన్న తేదీల్లో కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు.

  కొత్త కారు లేదా బైక్ కొనడానికి 5 మంచి ముహూర్తాలు :

 ఈ నెలలో వాహనం కొనేందుకు ఐదు అనుకూలమైన రోజులు ఏంటంటే…. సెప్టెంబర్ 2 (బుధవారం)   భరణి నక్షత్రం, కృష్ణ పక్ష పంచమి తిథిలో సాయంత్రం 6:43 గంటల నుండి  తరువాత రోజు ఉదయం 5:46 వరకు మంచి ముహూర్తం ఉంది. 

ఆ తర్వాత సెప్టెంబర్ 6 (ఆదివారం) ఆర్ద్ర నక్షత్రం, కృష్ణ పక్ష దశమి తిథి కలయికలో సాయంత్రం 7:52 నుండి తరువాత  రోజు ఉదయం 6:02 వరకు  అనుకూల సమయం.

సెప్టెంబర్ 16 (బుధవారం) విశాఖ నక్షత్రం, శుక్ల పక్ష పంచమి తిథిలో సాయంత్రం 5:22 నుండి మరుసటి రోజు ఉదయం 6:07 వరకు వాహన డెలివరీకి మంచి సమయం. 

అలాగే   సెప్టెంబర్ 20 (ఆదివారం) పూర్వాషాఢ నక్షత్రం, శుక్ల పక్ష నవమి తిథిలో ఉదయం 6:10 నుండి రాత్రి 11:18 వరకు రోజంతా  మంచి సమయం. 

ఇక చివరిగా సెప్టెంబర్ 27 (ఆదివారం) ఉత్తర భద్రపద నక్షత్రం, కృష్ణ పక్ష ప్రతిపద తిథిలో  ఉదయం 7:10 నుండి రాత్రి 11:18 వరకు శుభ ముహూర్తం.

ఈ ఐదు శుభ సమయాల్లో ఏదో ఒక మంచి ముహూర్తాన్ని చూసుకొని, రాహుకాలం లేని సమయంలో వాహన పూజ పూర్తి చేసి కొత్త వాహనాన్ని  ఇంటికి తీసుకెళ్లవచ్చు. 

వాహనం కొనేముందు గుర్తించుకోవాల్సిన విషయాలు
జాతకంలో చంద్ర బలం: మంచి ముహూర్తంతో పాటు, మీ జాతకంలో చంద్రుడి స్థానం, చంద్ర బలం ఎలా ఉందో ఒక్కసారి సరిచూసుకోవడం మంచిది. 

రాహుకాలం చూసుకోవాలి: జ్యోతిష్యం ప్రకారం రాహుకాలం మంచిది కాదు కాబట్టి, ఆ సమయంలో కాకుండా మిగతా మంచి సమయంలో  వాహనాన్ని డెలివరీ తీసుకోవడం శ్రేయస్కరం.
 

©️ VIL Media Pvt Ltd.