
శ్రీవిష్ణు హీరోగా కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఇప్పటికే చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, తాజాగా తన 39వ సినిమాను ప్రకటించారు. నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సన్నీ సంజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. సోమవారం ఈ చిత్రాన్ని అనౌన్స్ చేస్తూ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ప్రస్తుత యువత ఎదుర్కొంటున సమస్యలతో సాగిన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇందులో సూర్య అనే మిడిల్ క్లాస్ యువకుడిగా శ్రీవిష్ణు కనిపించనున్నట్టు రివీల్ చేశారు. ‘చిన్నప్పట్నుంచీ ఎన్నో ఆశయాలతో పెరిగి జీవితం ఇచ్చే జీతంతో రొటీన్‌గా బత్రికేస్తాం’ అని చెప్పిన శ్రీవిష్ణు.. ఇది మనందరి కథ, అందరిలాగే నా కథ అని చెప్పడం ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైందని, త్వరలోనే ఇతర నటీనటుల వివరాలను ప్రకటిస్తామని చెప్పారు.