Reading Time: 2 minutes

అముల్ నెయ్యికి అంతర్జాతీయ గుర్తింపు! ప్రపంచంలోనే అత్యుత్తమ లిస్టులో చోటు.. భారతీయ బ్రాండ్ల అరుదైన ఘనత..

Caption of Image.

ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమమైన, శ్రేష్టమైన  వెన్న (నెయ్యి) బ్రాండ్ల లిస్టులో మన భారతదేశానికి చెందిన రెండు ప్రముఖ బ్రాండ్లు గొప్ప  ప్లేస్  దక్కించుకున్నాయి. పాపులర్ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ప్లాట్‌ఫామ్ ‘టేస్ట్‌అట్లాస్’ (TasteAtlas) విడుదల చేసిన ఈ లిస్టులో భారతీయ బ్రాండ్లు ప్రపంచ దేశాల సరసన నిలిచాయి.
  
చోటు దక్కించుకున్న భారతీయ బ్రాండ్లు:
అముల్ స్వచ్ఛమైన నెయ్యి (Amul Pure Ghee): భారతదేశంలో ప్రతి ఇంటికీ పరిచయం ఉన్న అముల్ నెయ్యి  అద్భుతమైన నాణ్యతతో ఈ లిస్టులో స్థానం సంపాదించింది. ఇది తనదైన రంగు, మంచి సువాసన, అలాగే ఇంట్లో సాంప్రదాయ పద్ధతిలో తయారుచేసిన నెయ్యిలాంటి గరుకైన ఆకృతి (Granular texture) ఉండటంతో ఎంతో పేరుగాంచింది.

గిర్ ఆర్గానిక్ A2 గిర్ ఆవు నెయ్యి (Gir Organic A2 Gir Cow Ghee): గుజరాత్‌లోని సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫామ్‌లో పెరిగే స్వదేశీ ‘గిర్’ ఆవుల పాలతో ఈ నెయ్యిని అత్యంత సహజ సిద్ధంగా తయారు చేస్తారు. దీని నాణ్యత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.

ఈ రెండు భారతీయ ఉత్పత్తులు టేస్ట్ అట్లాస్ ర్యాంకింగ్‌లో 6వ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. అత్యుత్తమ నాణ్యత, సాంప్రదాయ పద్ధతులు, ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న ఆహార పదార్థాలకే ఈ లిస్టులో చోటు కల్పిస్తామని టేస్ట్ అట్లాస్   ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానాల్లో నిలిచిన ఇతర దేశాలు:
మొదటి స్థానం (ఆస్ట్రేలియా): ‘పెపె సయా’ (Pepe Saya) సాల్టెడ్ కల్చర్డ్ బటర్, ‘వెస్ట్రన్ స్టార్’ (Western Star) ఒరిజినల్ సాల్టెడ్ బటర్‌లతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలిచింది.

రెండవ స్థానం (బెల్జియం): ‘L&L ప్లాక్వేట్’, ‘కార్ల్స్‌బర్గ్’ బ్రాండ్లు బెల్జియం తరఫున రెండవ  స్థానాన్ని దక్కించుకున్నాయి.

మూడవ స్థానం (డెన్మార్క్): ప్రసిద్ధ ‘లూర్పాక్’ (Lurpak) స్లైట్లీ సాల్టెడ్ బటర్‌తో పాటు డెన్మార్క్ బ్రాండ్లు మూడో స్థానంలో ఉన్నాయి.

ఐదవ స్థానం (ఫ్రాన్స్): ‘మైసన్ బోర్డియర్’, ‘ఎచిరే’ వంటి ప్రసిద్ధ ఫ్రెంచ్ బ్రాండ్లు ఐదవ స్థానంలో నిలిచాయి.

వీటితో పాటు ఇంగ్లాండ్, ఐర్లాండ్, ఇటలీ, న్యూజిలాండ్, నార్వే, స్పెయిన్ సహా అమెరికా దేశాలకు చెందిన వెన్న, నెయ్యి బ్రాండ్లు కూడా ఈ   లిస్టులో  చోటు దక్కించుకున్నాయి. మన దేశపు స్వదేశీ ఉత్పత్తులు ఇలా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం భారతీయులకు గర్వకారణం.
 

©️ VIL Media Pvt Ltd.