Reading Time: 2 minutes
MS Dhoni: సాక్షితో ఏడడుగులు వేయకముందు ధోనీ మనసు దోచిన ఆ నలుగురు గ్లామర్ క్వీన్స్ వీరే

MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‎గా పేర్గాంచిన మహేంద్రసింగ్ ధోనీ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఆసక్తికరమే. 2010లో సాక్షితో వివాహానికి ముందు ధోనీ పేరు పలువురు హీరోయిన్లతో ముడిపడి మీడియాలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఎంతమందితో పేర్లు ముడిపడి వార్తల్లో నిలిచినా, ధోనీ 2010 జులై 4న సాక్షి సింగ్‌ను వివాహం చేసుకుని ఆదర్శవంతమైన వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు. మీడియాలో వచ్చిన అనేక కథనాలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయి తప్ప అధికారికంగా ధోనీ ఏనాడూ వాటిపై స్పందించలేదు. ఆ లవ్ రూమర్ల వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాలను తెలుసుకుందాం.

రాయ్ లక్ష్మితో డేటింగ్ పుకార్లు

హీరోయిన్ రాయ్ లక్ష్మితో ధోనీకి ఉన్న అనుబంధం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. 2008-09 సమయంలో ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందనే వార్తలు తెగ ప్రచారమయ్యాయి. పలు కార్యక్రమాల్లో వీరిద్దరూ కలిసి కనిపిం‌చడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రాయ్ లక్ష్మి, ధోనీతో ఉన్న పాత అనుబంధాన్ని ప్రస్తావిస్తూ తన జీవితంలో అది ఒక మచ్చ లాంటిదని వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనెతో అనుబంధం

టీమిండియా కెప్టెన్‌గా ఎదుగుతున్న రోజుల్లో ధోనీ పేరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనెతో గట్టిగా వినిపించింది. ఒక ఇంటర్వ్యూలో ధోనీ స్వయంగా దీపిక తనకు క్రష్ అని వెల్లడించడం ఈ ఊహాగానాలకు కారణమైంది. ఆమె నటించిన ఓం శాంతి ఓం సినిమాపై ధోనీ ప్రత్యేక శ్రద్ధ చూపించడమే కాకుండా, షారూఖ్ ఖాన్‌ను కోరి ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేయించుకున్నారని ఆ రోజుల్లో వార్తలొచ్చాయి. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ ఎప్పుడూ దీనిపై ఇద్దరి నుంచి అధికారిక ప్రకటన రాలేదు.

గజినీ ఫేమ్ ఆసిన్‌తో ప్రేమాయణం

సౌత్ నుంచి బాలీవుడ్ వెళ్లిన ప్రముఖ నటి ఆసిన్‌తో కూడా ధోనీ పేరు వినిపించింది. ఒక ప్రముఖ దుస్తుల బ్రాండ్ ప్రకటనల కోసం కలిసి పనిచేసిన సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం మొదలైంది. 2010 సమయంలో ధోనీ నేరుగా ఆసిన్ ఇంటికి వెళ్లాడనే వార్తలు రావడంతో వీరి లవ్ ఎఫైర్ రూమర్లు ఊపందుకున్నాయి. అయితే ఈ కథనాలు వెలువడిన కొద్ది రోజులకే అంటే 2010 జులైలో ధోనీ ఊహించని విధంగా సాక్షితో ఏడడుగులు వేయడంతో ఈ పుకార్లన్నింటికీ శాశ్వతంగా తెరపడింది.

ప్రొడ్యూసర్ ప్రీతి సిమోస్‌తో స్నేహం

సినీ నటీమణులే కాకుండా ప్రముఖ టీవీ ప్రొడ్యూసర్, కామెడీ షో నిర్వాహకురాలైన ప్రీతి సిమోస్‌తో కూడా ధోనీ ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. క్రికెట్ టోర్నీలు, ఈవెంట్ల సమయంలో వీరిద్దరి మధ్య ఉన్న సన్నిహిత స్నేహాన్ని చూసి చాలామంది ఎఫైర్‌గా పొరబడ్డారు. అయితే వారిద్దరి మధ్య కేవలం మంచి స్నేహం మాత్రమే ఉందని, ప్రేమ వ్యవహారం ఏమీ లేదని పరిశ్రమ వర్గాలు ఆ తర్వాత స్పష్టం చేశాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..