Reading Time: 2 minutes

భారతీయ వాస్తుకళా స్వర్ణయుగం: గుప్తుల కాలం నాటి గుహాలయాలు, దేవాలయాలు, స్తూపాల అద్భుత కట్టడాలు!

Caption of Image.

భారతీయ చరిత్రలో ‘స్వర్ణయుగంగా’ పిలువబడే గుప్తుల కాలంలో వాస్తు, శిల్పకళలు అద్భుతమైన శిఖరాలను తాకాయి. అప్పట్లో కేవలం పూజలకోసమే కాకుండా, శిల్పకళా సౌందర్యానికి ప్రతీకగా ఎన్నో అద్భుతమైన కట్టడాలను నిర్మించారు. నగర, ద్రవిడ శైలుల అరుదైన సమ్మేళనంతో రూపుదిద్దుకున్న ఈ నిర్మాణ శైలి, నాటి రాజుల కళాపోషణకు తార్కాణంగా నిలుస్తుంది. గుహాలయాలు, స్తూపాలతో పాటు విభిన్న ఆకారాల్లో (చతురస్రాకార, వృత్తాకార పైకప్పులతో) వారు నిర్మించిన దేవాలయాలు, అలాగే నాటి శిల్పాలు భారతీయ సంస్కృతికి శాశ్వత నిధిగా నిలిచాయి. ఆనాటి అద్భుతమైన వాస్తుకళా విశేషాలు, ప్రముఖ దేవాలయాల ప్రత్యేకతలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం….

గుప్తుల కాలం నాటి వాస్తుకళ నగర ద్రవిడ రీతుల సమ్మేళనం. ఈ కాలం నాటి వాస్తుకళ మూడు విధాలు 1. గుహాలయాలు 2. దేవాలయాలు 3. స్తూపాలు.

*చతురస్రాకారపు పైకప్పు కలిగిన దేవాలయాలు సాంచీలోని 17వ నంబరుగల ఆలయం.
*చతురస్రాకారంపై విమానం కలిగిన దేవాలయాలు నాచ్నా (మధ్యప్రదేశ్)లోని పార్వతీ ఆలయం (ద్రావిడ శైలి), భూమ్రా (మధ్యప్రదేశ్)లోని శివాలయం.
*చతురస్రాకారంపై శిఖరం కలిగిన దేవాలయం దేవ్​గఢ్ (మధ్యప్రదేశ్)లోని దశావతార దేవాలయం, భితర్గాంలోని దేవాలయం. 
*దీర్ఘచతురస్రాకారపు పైకప్పు కలిగిన దేవాలయాలు ఐహోల్లోని కపోతేశ్వర దేవాలయం, దుర్గ ఆలయాలు. 
*వృత్తాకారపు పైకప్పు కలిగిన ఆలయాలు రాజగృహంలోని మణియార మఠం(మణినాగుని ఆలయం). 

దేవగఢ్ దేవాలయం
*ఇక్కడి  దశావతార ఆలయం క్రీ.శ.6వ శతాబ్దానికి చెందినది. ఇది విశాలమైన అధిష్ఠానం కలిగి ఉంది. 
*కేంద్ర భాగంలో సమచతురస్రాకారపు గర్భగుడి ఉంది. గర్భగృహ గోడల మీద, ఫలకాల మీద, సౌందర్యవంతమైన శిల్పాలంకరణలు దర్శనమిస్తాయి.
*ఉపరితల విమానం సూచీ ముఖాలంకృతంగా ఉండటం ఇంకో విశేషంగా చెప్పవచ్చు.
*అధిష్ఠానపు అన్ని మూలల్లోను చిన్నచిన్న దేవాలయాలు నిర్మించారు. ఈ దేవాలయం ఐదు దేవతామూర్తులను కలిగి ఉంది. 

భితర్గాం దేవాలయం
*గుప్తుల కాలంలో ఇటుకలతో కట్టిన మొదటి దేవాలయం భితర్గాం దేవాలయం.
*బుద్ధగయలోని మహాబోధి దేవాలయం కూడా ఆరో శతాబ్దానికి చెంది భితర్గాం దేవాలయాన్ని పోలి ఉంది.
*గుప్తుల శిల్పకళాశైలి మధురశైలి నుంచి ఆవిర్భవించింది. 
 
ఉదాహరణలు 
*భూమ్ర – గణేశ్వర ఏకముఖ లింగాలు (బ్రహ్మ, యమ, కుబేర, కార్తికేయ, సూర్య, ఇంద్రాది ప్రతిమలు)
*దేవగఢ్ – విష్ణు, రామ, కృష్ణ ప్రతిమలు
*ఉదయగిరి – వరాహ విగ్రహం(ఒరిస్సా)
*రాజషాహి – కృష్ణుడు, అతని సహచరుల 

ప్రతిమలు 
సారనాథ్ – పద్మాసీనుడై ధర్మచక్ర ప్రవర్తన చేస్తున్న బుద్ధ విగ్రహం

©️ VIL Media Pvt Ltd.