
సందీప్ రెడ్డి వంగ నిర్మాతగా మారి చేస్తున్న సినిమా రోమాంచకం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు హీరో విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ – విజయ్ అన్న, సందీప్ అన్న అర్జున్ రెడ్డితో ప్రేక్షకులకు ఇచ్చిన ఫీవర్ మామూలుది కాదు. మాపై ఆ సినిమా ఎంతో ఇంపాక్ట్ చూపించింది. విజయ్ అన్న, తరుణ్ భాస్కర్ అన్న పెళ్లి చూపులు సినిమా చూసి మనం కూడా సినిమాల్లో ప్రయత్నించవచ్చు అనే నమ్మకం కలిగిందని అన్నారు. మా ఫ్రెండ్స్ బ్యాచ్ లో జరిగే డిస్కషన్ ఏంటంటే ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. వాటికి ప్రచారం ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎలా అని ఆలోచించేవాళ్లం.
ఆ హీరో అర్ధరాత్రి అడవి మధ్యలో నాకు నాటుకోడి కావాలి అని అడిగాడు.. నేను షాక్ అయ్యా
నేను మేమ్ ఫేమస్ సినిమా చేశాక ఆ సినిమాకు సపోర్ట్ చేసేందుకు విజయ్ అన్న ప్రచారం చేశారు. అది ఇప్పటికీ అందరికీ గుర్తుంది. అప్పుడు విజయ్ అన్న ఇచ్చిన బూస్ట్ ఇంకా మాలో ఉత్సాహం నింపుతోంది. సందీప్ అన్న ఈ సినిమా కథ గురించి చెప్పి విను అన్నప్పటి నుంచి, భద్రకాళీ ఆఫీస్ లో అడుగుపెట్టినప్పటి నుంచి నాకు జీవితంలో రోజూ రోమాంచకమే. అర్జున్ రెడ్డి తర్వాత దేశమంతా మన వాళ్లైన సందీప్, విజయ్ అన్న గురించి తెలిసింది. వాళ్ల గురించి మాట్లాడుకున్నారు.
అతను చాలా మంచి మనిషి..! అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ నన్ను చూసి లేచి నిలబడతాడు..
ఈ రోజు వాళ్ల బ్యానర్ లో సినిమా చేస్తుంటే నాకూ పెద్ద హీరో కావాలనిపిస్తోంది. అందుకు ఈ సినిమానే మెట్టు కావాలి. ఈ సినిమా మిమ్మల్ని ఎంత ఎంటర్ టైన్ చేస్తుందో, ఎంత నవ్విస్తుందో నేను ఊహించగలను. ఆ క్యారెక్టర్స్ లో ఉండే ఫన్, స్వీట్ నెస్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. సెప్టెంబర్ 3న ఈ క్యూట్ ఫీల్ మీకు రెండున్నర గంటలు నాన్ స్టాప్ గా ఉంటుంది. ఇదొక క్యూట్ ఫన్ ఫిలిం. మీరు ఫ్యామిలీతో వెళ్లినా, ఫ్రెండ్స్ తో వెళ్లినా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
16 ఏళ్లకే ఎంట్రీ 26ఏళ్లకే కెరీర్ క్లోజ్..! పెళ్ళైన 15 రోజులకే పారిపోయిన భర్త..!! ఈ హీరోయిన్ లైఫ్ లో సినిమాకు మించిన ట్విస్ట్‌లు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.