Reading Time: < 1 minute

బీటెక్ చేశారా ? టాటా ఇన్‌స్టిట్యూట్లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి!

Caption of Image.

టాటా ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.

పోస్టు పేరు: ప్రాజెక్ట్ ఇంజినీర్. 

ఎలిజిబిలిటీ: ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్‌‌‌‌లో కనీసం 60 శాతం  మార్కులతో బీఈ/ బీటెక్  పూర్తిచేసి ఉండాలి. హై-స్పీడ్ అనలాగ్, డిజిటల్ వీఎల్‌‌‌‌ఎస్‌‌‌‌ఐ సర్క్యూట్ల రూపకల్పన, డీబగ్గింగ్‌‌‌‌లో ఏడాది అనుభవం కలిగి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 29 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్  వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 30. 

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.tifr.res.inను సందర్శించండి.

©️ VIL Media Pvt Ltd.