Reading Time: 3 minutes
2026 September 10 Upcoming South Movies Releasing In Theatres

Theatrical Releases: బాక్సాఫీస్ వద్ద సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోష్ జోరుగానే కనిపిస్తోంది. ఆగస్టు నెలలో క్రేజీ కంటెంట్ ను పంచిన సౌత్ ఇండస్ట్రీ, సెప్టెంబర్ 2026 నెలలో కూడా అదే జోష్‌ను కొనసాగించడానికి సరికొత్త లైనప్‌తో సిద్ధమైంది. యూత్‌ఫుల్ లవ్ స్టోరీలు, హై-స్టేక్స్ యాక్షన్ థ్రిల్లర్లు, సోషియో-ఫాంటసీ కామిక్ ఎంటర్‌టైనర్ల వరకు ఎన్నో వైవిధ్యమైన సినిమాలు సెప్టెంబర్ లో థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. సెప్టెంబర్ లో వెండితెరపై ఏ సినిమాలు సందడి చేయబోతున్నాయి ? ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి ? అనే వివారాలపై ఓ లుక్ వేద్దాం పదండి.

1. రోమాంచకమ్ (Romanchakam)

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ నిర్మించిన ఈ యూత్‌ఫుల్ లవ్ స్టోరీపై మంచి అంచనాలు ఉన్నాయి. సుమంత్ ప్రభాస్, అనంతక సనిల్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ప్రేమకథను వేణుగోపాల్ రెడ్డి డైరెక్ట్ చేశారు. కాలేజ్ బ్యాక్‌డ్రాప్, కామెడీ, ఎమోషన్స్ కలగలిసిన ఈ సినిమా సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

2. ఐ యామ్ గేమ్ (I’m Game)

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కెరీర్ మైల్‌స్టోన్ 40వ సినిమాగా రాబోతున్న హై-బడ్జెట్ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’. బ్లాక్‌బస్టర్ ‘RDX’ ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వంలో సాగే ఈ కథలో దుల్కర్ సల్మాన్ ‘డాన్ జాన్’ అనే మైండ్ గేమ్స్ ఆడే గ్యాంబ్లర్ పాత్రలో నటిస్తున్నారు. అండర్‌వరల్డ్ బెట్టింగ్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ పాన్-ఇండియా మూవీసెప్టెంబర్ 3న మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

3. రంభ ఊర్వశి మేనక (Ramba Oorvasi Menaka)

అల్లరి నరేష్ మార్క్ అవుట్ అండ్ అవుట్ కామెడీ జోనర్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తూ చేసిన సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. ఒక మాయా పుస్తకం ద్వారా దేవలోక అప్సరసలను భూమిపైకి రప్పించడానికి 15 ఏళ్లు ప్రయత్నించే ఒక వ్యక్తి కథ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. చంద్రమోహన్ చింతడ దర్శకత్వంలో సురభి పురాణిక్, రాశి సింగ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 4న నవ్వులు పూయించడానికి థియేటర్లలోకి వస్తోంది.

4. దొంగ నా కొడుకు (Donga Na Koduku)

‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ మౌళి తనుజ్ ప్రశాంత్ హీరోగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న సరికొత్త యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘దొంగ నా కొడుకు’. శ్రీను కంబాల దర్శకత్వంలో సుస్మితా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌తోనే క్రేజ్ తెచ్చుకుంది. సెప్టెంబర్ 4న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

5. సర్దార్ 2 (Sardar 2)

తమిళ హీరో కార్తీ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ ‘సర్దార్ 2’. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో వస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ సినిమాలో ఎస్‌.జె. సూర్య మెయిన్ విలన్‌గా నటిస్తుండగా, మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ పాన్-ఇండియా మూవీ సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

6. మందాడి (Mandaadi)

వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరో సుహాస్ లైనప్‌లో వస్తున్న మరో మూవీ ‘మందాడి’. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ అండ్ డ్రామా ఎలిమెంట్స్‌తో సాగే ఈ మూవీ సెప్టెంబర్ 10న థియేటర్లలో సందడి చేయబోతోంది.

7. మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi)

అక్కినేని హీరో సుమంత్ లీడ్ రోల్‌లో నటిస్తున్న మిస్టరీ స్పిరిచువల్ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఐశ్వర్యా రాజేష్, మాళవిక నాయర్, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ, ఒక పురాతన దైవిక రహస్యం చుట్టూ సాగుతుంది. అనూప్ రూబెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచిన ఈ సస్పెన్స్ మూవీ సెప్టెంబర్ 11న విడుదల కానుంది.

8. ది పారడైజ్ (The Paradise)

‘దసరా’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి కాంబినేషన్‌లో వస్తున్న మైల్ స్టోన్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘ది పారడైజ్’. 1980ల సికింద్రాబాద్ స్లమ్ నేపథ్యంలో ఒక అణగారిన తెగ తమ హక్కుల కోసం చేసే పవర్‌ఫుల్ పోరాటం చుట్టూ ఈ కథ సాగుతుంది. రాక్‌స్టార్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్లను షేక్ చేయడానికి వస్తోంది.

9. డోరతీ (Dorothy)

కీర్తి సురేష్, సనంత్ ప్రధాన పాత్రల్లో జియో స్టూడియోస్, సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన తమిళ ఇండిపెండెంట్ యాక్షన్ డ్రామా ‘డోరతీ’. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తన ల్యాండ్‌మార్క్ 10వ చిత్రంగా దీనిని తెరకెక్కించగా, లెజెండరీ కంపోజర్ ఇళయరాజా దీనికి సంగీతం అందించారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడిన తర్వాత, ఈ మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది.

10. ‘డెమోంటే కాలనీ 3’ (Demonte Colony 3)

అనేది రాబోతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్. అరుళ్‌నిధి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బ్లాక్‌బస్టర్ హారర్ ఫ్రాంచైజీ మూడవ భాగం సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.